చంద్రబింబం ఫిబ్రవరి 2 నుండి 8 వరకు | zodiac signs feb 2- 8 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం ఫిబ్రవరి 2 నుండి 8 వరకు

Published Sun, Feb 2 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

చంద్రబింబం ఫిబ్రవరి 2 నుండి 8 వరకు

చంద్రబింబం ఫిబ్రవరి 2 నుండి 8 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. గౌరవం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులలో విజయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది.  గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. విద్యార్థులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం. వివాదాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థి కంగా బాగుంటుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. పరిశోధకులకు గుర్తింపు రాగలరు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం.
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 ఇంటిలో శుభకార్యాలు. బాకీలు అంది అవసరాలు తీరతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పనులు సమయానికి పూర్తి కాగలవు. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. కుటుంబసమస్యల  నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. బాధ్యతలు పెరుగుతాయి.  గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో కొద్దిపాటి అవరోధాలు.  వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విదార్థుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 పనులు చకచకా పూర్తి చేస్తారు. రావలసిన  సొమ్ము అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం  అందుతుంది. పనులలో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో అనారోగ్యం.
 
 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement