చంద్రబింబం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు | zodiac signs from january 26 to february 1st | Sakshi
Sakshi News home page

చంద్రబింబం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు

Published Sun, Jan 26 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

చంద్రబింబం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు

చంద్రబింబం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగులు అదనపు  బాధ్యతలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. వివాదాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. వారం చివరిలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి.
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనాలు, భూములు కొంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు సజావుగా సాగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివర్లో ప్రయాణాలు. రుణయత్నాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి విభేదాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 రుణబాధలు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. వారం చివరిలో పనులు వాయిదా. మిత్రులతో వివాదాలు.
 
 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement