Taurus
-
టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుకు నామినేట్.. షారుక్ మెచ్చుకున్నారు!
భారతీయ సినిమాలో స్టంట్ మాస్టర్‌గా అనల్ అరసుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడుకు చెందిన ఈయన తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో స్టార్ హీరో చిత్రాలకు పని చేస్తూ ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ జవాన్‌కు అనల్ అరసు స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో తెరపైకి రానున్న ఇండియన్–2 చిత్రానికీ ఈయన ఫైట్స్ కంపోజ్ చేశారు. 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు'ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న వా వాద్ధియారే, హిందీలో బేబీజాన్, వార్ 2 తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈయన స్వీయ దర్శకత్వంలో హీరో విజయ్‌సేతుపతి వారసుడు సూర్యను హీరోగా పరిచయం చేస్తూ ఫీనిక్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే అనల్ అరసు 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు' పోటీల్లో నామినేట్ అయ్యారు. జవాన్ చిత్రానికి గానూ నామినేట్ దీని గురించి ఆయన సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుపుతూ టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుల్లో.. జవాన్ చిత్రానికి గానూ తన పేరు నామినేట్ అయ్యిందని చెప్పారు. ఇది ఆస్కార్ అవార్డుకు సమానమైనదిగా పేర్కొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరికి సంబంధించిన పురస్కారం అని చెప్పారు. ప్రపంచ స్థాయి చిత్రాలలో జవాన్ మూవీతో పాటు హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజబుల్, జాన్ విక్స్ 4 మొదలగు ఐదు చిత్రాలు నామినేట్ అయ్యినట్లు చెప్పారు. అవార్డు వస్తే సంతోషంఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుక కోసం అమెరికాకు పయనమవుతున్నట్లు తెలిపారు. తాను ఇంతకు ముందు 2017లో కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యానని, అయితే అది ప్రాంతీయ చిత్రాల కేటగిరి కావడంతో పెద్దగా ప్రచారం జరగలేదన్నారు. ఇప్పుడు వరల్డ్ స్థాయి చిత్రాల కేటగిరీలో జరుగుతున్న పోటీలో ఇంత వరకూ భారతీయ సినిమాకు చెందిన ఏ స్టంట్ మాస్టర్ ఈ అవార్డును గెలుచుకోలేదన్నారు. అలాంటి తనకు అవార్డు వస్తే సంతోషం అని అనల్ అరసు పేర్కొన్నారు. ఈ అవార్డుకు నామినేట్ అవడంతో షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, దర్శకుడు అట్లీ వంటి పలువురు అభినందించారని చెప్పారు. -
ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు
వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. -
Yearly Horoscope: ఈ ఏడాది రాశి ఫలాలు.. పూర్తి వివరాలు
రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు మేషరాశి ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు. ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1 వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1 మిధున రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4 కర్కాటక రాశి ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4 కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లవ్సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. సింహ రాశి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిష్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి. కన్యా రాశి ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. తులారాశి ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి. ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము. తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కుంభ రాశి ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి. బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. మీన రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. హనుమాన్ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. -పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె) సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023. -
వృషభ రాశి ఫలాలు 2022-23
కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (దశమం)లోనూ తదుపరి మీనం (లాభం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (భాగ్యం)లోనూ మిగిలినకాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (జన్మం), కేతువు వృశ్చికం (సప్తమం)లోనూ తదుపరి రాహువు మేషం (వ్యయం), కేతువు తుల (షష్ఠం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (జన్మం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా శోధింపగా లాభాలు బాగా ఉంటాయి. కార్య సానుకూలత బాగుంటుంది. అయినా చికాకులు వెంబడిస్తూనే ఉంటాయి. ఇదొక విచిత్రమైన కాలమనే చెప్పాలి. ఏ విధమైన నిర్ణయాలైనా త్వరగా తీసుకోలేకపోతారు. తరచుగా భయాందోళనలకు గురవుతుంటారు. గురువు లాభ సంచారం, శని అనుకూల సంచారం మీకు గొప్ప వరమనే చెప్పాలి. ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా, ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా, ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైనవారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబసభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబసభ్యులతోనూ, మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఈ సంవత్సరం అతి జాగ్రత్త, మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా, మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. వ్యాపారులకు సంవత్సరం అంతా లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన. ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం. నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి. సహజంగా గురుబలం దృష్ట్యా సమస్యలు రాకూడదు కానీ ఆగస్టు తరువాత మీకు కానీ మీ కుటుంబసభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్లు, ప్లాన్లు వంటివి తేలికగా సమకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి, కొత్త ప్రయత్నం చేయడం మంచిదికాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏమిటి అంటే ధనవ్యయం. మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం చెడకొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ ఉన్నా, ఫలితాలు అనుకూలం. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు బహుజాగ్రత్తలు పాటించాలి. కృత్తికా నక్షత్రం వారు ఇబ్బందులు లేని జీవితం గడుపుతారు. కానీ ఏ స్థాయి వారికి ఆ స్థాయి మానసిక సమస్యలు వుంటాయి. ప్రధానంగా అభద్రతాభావం వెంబడిస్తుంది. అయితే కచ్చితంగా అన్ని విషయాల్లోనూ సానుకూలత ఎక్కువగా వుంటుంది. అందరూ సహకరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. రోహిణీ నక్షత్రం వారికి నేత్ర సమస్యలు ఎక్కువ కాగలవు. జీర్ణ సంబంధ, చర్మ సంబంధ సమస్యలు వున్న ఈ నక్షత్రం వారు ఎక్కువగా చికాకులు పొందుతారు. స్థిరాస్తి సమస్యలను త్వరగా సెటిల్మెంట్ చేసుకోకపోవడం శాపంగా మారుతుంది. మృగశిర నక్షత్రం వారికి క్రమంగా శుభపరిణామాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వుండి ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. పిల్లల విద్య వివాహ ప్రయత్నాలు, ఉద్యోగంలో సక్సెస్ వార్తలు ఆనందం కలిగిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు, దాన ధర్మాలు చేస్తారు. శాంతి: ఏప్రిల్‌లో రాహుకేతు శాంతి చేయించండి. ఆగస్టులో కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ దుర్గ, గణపతి, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. ‘గజేంద్రమోక్షం ఘట్టం’ రోజూ పారాయణ చేయడం చాలా అవసరం. త్రిముఖి, షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి జరుగుతుంది. ఏప్రిల్: తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. కొన్ని అంశాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. ఎవరినీ నమ్మి పనులు చేయవద్దు. మితభాషణ అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం మంచిది. మే: కొన్ని సందర్భాలలో ధైర్యంగా బుద్ధిని ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు అధైర్యంగా ఉంటారు. భోజనవసతి, రోజువారీ పనులు చక్కగా ఉంటాయి. మితభాషణ, ఓర్పు, స్నేహం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జూన్: కోర్టు వ్యవహారాల్లో సెటిల్మెంట్ ధోరణి చాలా లాభం. తరచుగా బుద్ధిమాంద్యానికి లోనవుతారు. వీలయినంత వరకు దూరప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. పనులు వాయిదా వేసే లక్షణాలు విడనాడండి. భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి. జూలై: కుజుడు వ్యయంలో సంచారం ప్రారంభించారు. మూడు మాసాలు అనుకూలత తక్కువ. కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. గురు, శుక్ర సంచారం బాగుంది. అందువలన తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు: ఈ నెల నుంచి కుజస్తంభన, వృషభరాశిలో ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ధనవ్యయం అధికం అవుతుంది. పిల్లలతో మనస్పర్థలు ఎక్కువ అవుతాయి. ఈ నెల నుంచి ఆరోగ్యం, ఋణ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మనశ్శాంతిగా ఉండడం కోసం ప్రత్యేక సాధన అవసరం. సెప్టెంబర్: కుజుడు జన్మంలో సంచారం అనుకూలం కాదు. అయితే గురు శుక్ర బుధ గ్రహసంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. అక్టోబర్: తరచుగా శుభవార్తలు వింటారు. 15వ తేదీ తరువాత కుజుడి మార్పు వల్ల మంచి మార్పులు కొన్ని ప్రారంభం అవుతాయి. ద్వితీయార్ధంలో రవి కుజుల సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందున వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 15వ తేదీ వరకు కుజుడు, తరువాత శుక్రుడు అనుకూలంగా లేనందున కుటుంబ విషయంలో జాగ్రత్తలు అవసరం. నవంబర్: కోపం, ఆవేశం, మానసిక ఆందోళనలు జయించడానికి మెడిటేషన్ వంటి వాటిని ఆశ్రయించండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను, ఒంటరి ప్రయాణాలను విరమించుకోవడం శ్రేయస్కరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోరాదని సూచన. డిసెంబర్: అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి, ప్రధానంగా ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో సఫలం కాలేరు. ఫలితంగా కుటుంబ కలహాలు ఉంటాయి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తాయి. అవయవ ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. జనవరి: తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఋణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫిబ్రవరి: జన్మకుజుడు వ్యయరాహువులు సహజంగా ఇబ్బంది కలుగచేసే గ్రహాలు. అయితే మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ తెలివిగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎలర్జీలు, ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. ఆదాయ వ్యయాలు, ఋణాలు సమతూకంగా వుండవు. జాగ్రత్త అవసరం. మార్చి: ఏ పనీ సరిగా పూర్తి చేయలేరు. చాలా పనులు మొదలుపెడుతుంటారు. ఎవరి సహకారమూ అందదు. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచు కోపావేశాలు ప్రదర్శిస్తారు. వృథాగా సంచారం చేస్తూ ఉంటారు. రోజువారీ పనుల్లో సైతం సంతుష్టి లేకుండా కాలం గడుపుతారు. సాంఘిక కార్యకలాపాలు అగౌరవం తెచ్చే అవకాశం ఉంది. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచానాకి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
శార్వరి నామ సంవత్సర ( వృషభ రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో మీ జీవితభాగస్వామి పేరుమీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధరకు అమ్మి కమర్షియల్ ఏరియాలో విలువైన షాపుగానీ, స్థలంగానీ కొనుగోలు చేయగలుగుతారు. వేరేచోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీసం వివరణ కూడా కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. లౌక్యంగా ప్రతిఘటించి, వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. నౌకా రవాణా, జల రవాణా లాభిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంది. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. అయితే క్లయింట్స్ నిబద్ధత గురించి ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్ళి సంబంధం కుదురుతుంది. పదిరూపాయలు ఖర్చయ్యే చోట ఇరవై రూపాయలు ఖర్చుచేసి శుభకార్యాలు వైభవంగా నిర్వహిస్తారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వపరంగా మంచి ఆర్డర్లు తీసుకువస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల దగ్గర ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. సంవత్సర ద్వితీయార్ధంలో రెండు నెలలు వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తి ఉండదు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన పరస్థితి ఏర్పడుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాములతో వ్యాపారం చేసే కన్నా నాలుగు గేదెలు పెట్టుకుంటే మంచిదని భావిస్తారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలే దీనికి కారణమవుతాయి. లక్ష్మీప్రమిదలతో దీపారాధన చేయండి. రుద్రజడను ఉపయోగించండి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతోకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. సోదరసోదరీ వర్గానికి అండగా ఉంటారు. మధ్యవర్తిత్వం చేయవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరులకు సహాయం చేస్తారు. బాధ్యత అంతా మీపై వేసుకుంటారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి ఇదే రకమైన సహాయసహకారాలు లభిస్తాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలపాలు చేసుకోవద్దు. ప్రేమపెళ్ళిళ్ళకు సంబంధించిన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. పునర్వివాహాలు చేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యమధ్యలో జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఋణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్నిరకాల దేవుళ్ల అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు. వ్యవహారాలకు మాత్రం సంబంధించిన వ్యక్తులకు వాటా పంచవలసి వస్తుంది. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయగ్రస్తులైన ఇటువంటి వారితో మీ సన్నిహితులు కూడా చేరడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. కార్యాలయంలో రాజకీయాలు అధికం అవుతాయి. కుల సంబంధమైన రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి. అంతేగాని ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని భయానక వాతావరణం మాత్రం కలిగించవద్దు. పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. వైరివర్గం గుడ్‌విల్‌ను దెబ్బతీయగలుగుతారు. యోగాభ్యాసాల ద్వారా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా రావలసిన బిల్లులు ఆలస్యం అవుతాయి. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. అంతేగాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు. అందరినీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందు వలన కీర్తి, ధనం లభిస్తుంది. అయినవాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటారు. మీ పరపతి వల్ల వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పులు, ప్రభుత్వపరమైన స్కీముల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆర్ట్‌గ్యాలరీలు, బ్యూటీపార్లర్లు, అలంకార సంబంధిత వ్యాపారాలు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు ప్రతికూల కాలం. ప్రింటింగ్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ మధ్యస్థంగా ఉన్నాయి. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే అది ఆచరణలో సాధ్యంకాదు. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ట్యాక్స్లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు చోరికి గురి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. లీజులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో లాభపడే అవకాశాలు ఉన్నాయి. నిపుణులను సంప్రదించి కొనుగోలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. అయినా ఖర్చులకు వెనుకాడరు. దురభ్యాసాలు కలిగి, క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బందిపడతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతకాలం రక్తసంబంధీకులతో విభేదాలు చోటుచేసుకుంటాయి. కంటికి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో వెన్నునొప్పి బాధిస్తుంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు. మీమీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. విదేశీయాన విషయాలు, విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశీ వ్యాపారాలు, గ్రీన్‌కార్డు మొదలైనవి సానుకూలపడతాయి. తక్కువస్థాయి వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు. ప్రయోజనాలు వదులుకుంటారు కానీ మీరు మీ మనస్సాక్షికి కట్టుబడి ఉంటారు. అంగట్లో అమ్మకానికి అన్నీ ఉన్నాయి. కొనడానికి మన వద్దే డబ్బుల లేవన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కాని పని లేదని గ్రహిస్తారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావలసిన ప్రయోజనాలకు కూడా సమాజంలో ధనం వెచ్చించాల్సిన దుస్థితి దాపురించిందని బాధపడతారు. ధర్మానికి, న్యాయానికి కాని కాలం సంభవించిందని బాధపడతారు. చదివిన ధర్మశాస్త్రాల సారాంశం తెలిసివస్తుంది. పెద్దలు చెప్పిన నీతిసూత్రాలు, ధర్మసూత్రాలు పాటించినందుకు తగిన శాస్తి జరిగిందని మీకు మీరే సరిపెట్టుకుంటారు. విద్యార్థినీవిద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి రోజులు వస్తాయి. మీ వాక్చాతుర్యం, శక్తిసామర్థ్యాలు మంచి ఫలితాలనిస్తాయి. ధనం ఎంత వచ్చినా చేతిలో నిలబడకపోవడం అన్న దిగులు తీరుతుంది. నిలువుధనం ఏర్పడుతుంది. స్నేహం అనెడి మూడు అక్షరముల తీయని మాట మన సంస్కతి సాంప్రదాయాలలో ప్రముఖమైన స్థానాన్ని పొంది ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలకు, ఆదర్శమైన విషయాలకు సమాజ పరిరక్షణకు ప్రధాన భాగం వహించి వర్ధిల్లుతుంది. స్నేహమే జీవితంగా, ప్రాణంగా భావించి స్నేహానికి నిజమైన అర్థాన్ని తెలియజేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుత సామాజిక ప్రపంచంలో స్నేహాన్ని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం ఆవుతాయి. వ్యాపార అభివృద్ధి నిమిత్తం దూరప్రయాణాలు చేస్తారు. -
హమ్మయ్యా.. బయటపడ్డాను..
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో సోమవారం మాబుహుసేనికి చెందిన 30 అడుగుల నీరులేని పాడుబడ్డ బావిలో ప్రమాదశాత్తు ఓ వృషభం పడిపోయింది. గమనించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న ఇంచార్జ్ ఫైర్ ఆఫీసర్ ముత్తన్నగౌడ్, వెంకటేశ్వర్లు, రమేష్ నిచ్చెన సాయంతో బావిలో దిగి వృషభాన్ని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నానా అవస్థలు పడి వృషభాన్ని బయటకు తీశారు. దీంతో గ్రామస్తులు వారిని అభినందించారు. -
వికారినామ సంవత్సర (వృషభ రాశి) రాశిఫలాలు
వృషభరాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో శని, కేతువుల సంచారం, అష్టమ, భాగ్యస్థానాలలో గురు సంచారం, రెండింట రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, వ్యవహారాలపరంగా బాగుంది. రాజకీయంగా అగ్నిపరీక్షాకాలం. విద్యాసంబంధ విషయాలు, సాంకేతిక, గణిత విద్యలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆక్వా, పౌల్ట్రీరంగాల్లో కలసిరాదు. రాజకీయ పదవీ ప్రాప్తి సంభవం. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిదానం అవసరం. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు నడపడంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీవర్గానికి రహస్యంగా సహాయపడతారు. ప్రేమ వివాహాలు వివాదస్పదం అవుతాయి. స్త్రీలతో విభేదాలు కొంతకాలం ఇబ్బందిపెడతాయి. మీ ఆంతర్యం, వైరాగ్యం, నిర్వేదం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. పైకి నిండుకుండలా కనిపిస్తారు, గంభీరంగా ప్రవర్తిస్తారు. పదిమందికి సహాయం చేయగులిగిన శక్తిసామర్థ్యాలు, ధన బలం భగవంతుడు మీకు ఇస్తాడు. జ్యేష్ఠ సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణం అవుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా అండగా ఉంటారు. నిర్మాణ çపనులలో నాణ్యత కోసం ప్రయత్నిస్తారు. చాలామంది చాదస్తం అని అవహేళన చేసినా మీ పద్ధతి మార్చుకోరు. అదే మీకు మంచి కీర్తిప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. నష్టపోయిన విషయాన్ని చెప్పుకుంటే సిగ్గు పోతుందని మిన్నకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ వ్యాపారంలో ఒక స్త్రీ భాగస్వామ్యం కలసివస్తుంది. మీ వ్యాపారానికి ఉన్నతస్థాయి వ్యక్తుల పరపతి తోడ్పడుతుంది. వ్యాపార, ఆర్థిక విషయాలకు సంబంధించి స్నేహితులను, ఆత్మీయులను దూరంగా పెడతారు. అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్టూరమే మేలు అని భావిస్తారు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు మీకు తిరుగులేదు. జీవిత భాగస్వామితో విభేదాలు చికాకు కలిగిస్తాయి. పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తారు. వ్యసనపరులైన చిన్ననాటి స్నేహితులను ఆదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కళా సాంస్కృతిక రంగాల వారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళపట్ల జాగ్రత్తగా ఉండండి. మంచిగా ఉంటూ నమ్మకద్రోహం చేస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ఫర్నిచర్, గృహ పరికరాలు, హోమియోపతి, ఆయుర్వేదం, హోటళ్లు, బేకరీ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. మీ మాట జవదాటని రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు మీ మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం వక్రమార్గంలోకి వెళ్తారు. మంచిమాటలు చెప్పి వేరే చోట ఉంచి వాళ్లని ఓ దారికి తీసుకువస్తారు. విందులు, వినోదాలు ఎక్కువవుతాయి. వాటికి దూరంగా ఉండాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్స్‌కి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వివాదాలకు, దూరంగా ఉండండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో ఐకమత్యం లేని కారణం చేత సంతానాన్ని సక్రమమైన మార్గంలో నడిపించలేరు. అయితే ఈ సమస్య ఒక్క నెల మాత్రమే బాధిస్తుంది. తదుపరి సంతాన పురోగతి బాగుంటుంది. యూనియన్స్, క్లబ్బులు ప్రతిష్ఠాత్మకమైన సేవాసంస్థలలో మీకు మంచి గౌరవం, స్థానం లభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారులు మీ స్నేహితులు కావడం వల్ల మీ పొరపాట్లకు జరిమానా పడదు. మీరంటే ఎంతమాత్రం ఇష్టంలేని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ఆకస్మికంగా మిమ్మల్ని పిలిపించి అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు పొడగించబడతాయి. మీకు తెలియకుండా మీ భాగస్వాములు తీసుకున్న నిర్ణయాలు సంస్థకు చెడ్డపేరు తీసుకువస్తాయి. స్థిరాస్తుల పంపకంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. బతిమాలినా కాని పనులను భయపెట్టి సాధిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత శత్రువులు మళ్లీ తెరమీదకు వస్తారు. నిష్కారణమైన నిందలు మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. శుభకార్యాల విషయంలో పంతం నెగ్గించుకుంటారు. ఉద్యోగంలో ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయంకృతాపరాధాలే ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తివ్యాపార వ్యవహారాలలో విమర్శలు, ఇబ్బందులు ఏర్పడతాయి. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. కాలుష్యం వల్ల స్వల్ప అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయి. వైవాహిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోతారు. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అగ్రిమెంట్స్ వాయిదా పడతాయి. ప్రత్యర్థివర్గంలోని గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీలు ఆశించినట్లుగానే ఆగుతాయి. రాని బాకీలు రాకపోగా వివాదాస్పదాలు అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల నష్టపోకుండా నిలబడతారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు పొడిగించబడతాయి. పరభాషా ప్రావీణ్యం, సాంకేతికవిద్య, కళానైపుణ్యం, వైద్యవిద్య, క్రీడా నైపుణ్యం మొదలైనవి గుర్తింపుకు నోచుకొని ఉన్నతస్థితికి బాటలు వేస్తాయి. మీ ముందు పొగడడము, మీ చాటున తిట్టడం కొంతమందికి నిత్యకృత్యం అవుతుంది. సాక్ష్యాధారాలు చూపించి మరీ కొన్ని వివాదాలను పరిష్కరించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి కుళ్ళు రాజకీయాలు ఇబ్బంది పెడతాయి. టీవీ సినిమా రంగంలోని వారికి ఆశాజనకం. చిత్ర కళాకారులకు మంచి ఫలితాలున్నాయి. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు పరిశీలించుకుని సంతకం చేయండి. గణితవిద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం బాగుుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. పోటీ పరీక్షలలో నెగ్గి వైద్యకళాశాలలో సీటు సంపాదిస్తారు. విద్యాసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. విదేశీ విషయాలు కలసివస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ కోరుకునే వారికి బదిలీ అవుతుంది. ప్రేమ వివాహాలు ఫలించవు. జీవితంలో దగ్గరైన ఓ వ్యక్తిని నమ్మడం జరుగుతుంది. కానీ అతని వల్ల మీకు నమ్మకద్రోహం ఎదురవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభిస్తుంది. వస్త్ర వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం, ఆహారపదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి. క్రీడారంగంలో మీకున్న నైపుణ్యానికి తగిన గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మీ విధులను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ గుురువుల వల్ల నష్టపోతారు. అనువంశికంగా రావలసిన ఆస్తుల విషయంలో సమన్యాయం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ అవసరం. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్ విద్య, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఎప్పటినుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఉద్యోగం వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలక్ట్ అవుతారు. మీరు చేసే ఇతరాత్ర వ్యాపారాలు, వ్యవసాయరంగ ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్స్, చీరలు అమ్మడం, హోటళ్లు మొదలైన వ్యాపారాలు కలిసివస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు, లాభపడతారు. విమర్శలకు తావు లేకుండా రాజకీయపదవి లభిస్తుంది. -
ఈ రాశి వారు కళాభిమానులు
వృషభం: ఆస్ట్రోఫన్డా రాశులలో రెండోది వృషభం. ఇది సరి రాశి, ముఖాన్ని సూచిస్తుంది. సౌమ్య స్వభావం, స్థిరరాశి, భూతత్వం, స్త్రీ రాశి, వైశ్యజాతి. దీని దిశ దక్షిణం. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం నాలుగు పాదాలూ, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. ఈ రాశి పర్షియా, హాలండ్, రష్యా పరిసర దేశాలను సూచిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు. సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. గొప్ప శారీరక దారుఢ్యం ఉంటుంది. తేలికగా అలసట చెందరు. నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు గానీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తారు. వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. లలిత కళలపై, వస్త్రాలంకరణలు, సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ కలిగి ఉంటారు. అసాధారణమైన తెలివితేటలు, గొప్ప సంయమనం వీరి సొత్తు. ఆర్థిక వ్యవహారాలను లోపం లేకుండా బాధ్యతాయుతంగా నెరవేర్చడంలో నేర్పరులు. క్లిష్టమైన వ్యవహారాలను సైతం తేలికగా చక్కదిద్దగలరు. దౌత్యం నెరపడంలో సిద్ధహస్తులు. వృషభరాశి వారు విశ్వసనీయులుగా ఉంటారు. అవసరమైతే ఇతరుల భారాన్ని సైతం తామే భరించేందుకు సిద్ధపడతారు. నిర్భీతి, కారుణ్యం, ఓపిక సహజ లక్షణాలుగా గల వృషభరాశి జాతకులు నాయకత్వ పదవుల్లో రాణించగలరు. వాహన, వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, అలంకరణలు, ప్లాస్టిక్, హోటల్, మద్యం వ్యాపారాలు వీరికి కలసి వస్తాయి. సంగీతం, రంగస్థలం, సినీ రంగాల్లోనూ వృషభరాశి జాతకులు రాణించగలరు. గ్రహగతులు సానుకూలంగా లేకుంటే మాత్రం అసూయతో రగిలిపోతూ ఇతరులను ఇబ్బందిపెడతారు. మార్పును ఒకపట్టాన అంగీకరించలేరు. మొండి వైఖరితో చిక్కుల్లో పడతారు. అంతులేని ఐశ్వర్య లాలసతో సంపాదనే వ్యసనంగా మార్చుకొని ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తారు. బద్దకంతో నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం కారణంగా శ్రమకు తగ్గ ఫలితం పొందలేకపోతారు. (వచ్చేవారం మిథునరాశి గురించి...) - పన్యాల జగన్నాథ దాసు -
గ్రహాల పుట్టుకకు జీవరేఖ!
మనకు 450 కాంతి సంవత్సరాల దూరంలో.. వృషభరాశి(టారస్)లో ఉన్న ‘జీజీ టారీ-ఏ’ అనే ద్వినక్షత్ర వ్యవస్థ చిత్రం ఇది. మధ్యలో ఉన్నవి జంట నక్షత్రాలు కాగా, రెండింటి చుట్టూ ఉన్నది వాయువులు, పదార్థంతో కూడిన భారీ వలయం. దీనికి లోపల నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న మరో వాయువుల వలయం కూడా ఉంది. బయటి వలయం నుంచి లోపలి వ లయానికి, అక్కడి నుంచి పెద్ద నక్షత్రానికి పదార్థం, వాయువులు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయట. అయితే.. రెండు వలయాల మధ్య కొంత పదార్థం, వాయువులు పోగుపడుతున్నాయని, కాలక్రమంలో అక్కడ గ్రహాలు ఏర్పడే అవకాశం ఉందని యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ పరిశోధకులు వెల్లడించారు. అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్‌మిల్లీమీటర్ అర్రే(అల్మా) టెలిస్కోపుతో ఈ నక్షత్ర వ్యవస్థను పరిశీలించడంతో ఈ విషయం తెలిసిందట. మన సూర్యుడు కూడా ఒకప్పుడు ఇలాంటి జంట నక్షత్ర వ్యవస్థలో ఒకడిగా ఉండేవాడట. జీజీ టారీ-ఏపై పరిశోధనలు ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల అన్వేషణకూ ఉపయోగపడతాయని భావిస్తున్నారు. -
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. -
చంద్రబింబం: ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. రాజకీయరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వారం మధ్యలో ధనవ్యయం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. నిరుద్యోగుల కల ఫలించే సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. రాజకీయరంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో ప్రయాణాలు, రుణాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) అవసరాలు తీరతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. పరిశోధనల్లో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమానంతరం కొంత ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారంలో అనుకూలత. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణాలు తీరతాయి. ఇంటిలో శుభకార్యాలు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదనిపిస్తుంది. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రశంసలు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు, వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. వారం చివరిలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనాలు, భూములు కొంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు సజావుగా సాగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివర్లో ప్రయాణాలు. రుణయత్నాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి విభేదాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) రుణబాధలు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. వారం చివరిలో పనులు వాయిదా. మిత్రులతో వివాదాలు. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు