
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో సోమవారం మాబుహుసేనికి చెందిన 30 అడుగుల నీరులేని పాడుబడ్డ బావిలో ప్రమాదశాత్తు ఓ వృషభం పడిపోయింది. గమనించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న ఇంచార్జ్ ఫైర్ ఆఫీసర్ ముత్తన్నగౌడ్, వెంకటేశ్వర్లు, రమేష్ నిచ్చెన సాయంతో బావిలో దిగి వృషభాన్ని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నానా అవస్థలు పడి వృషభాన్ని బయటకు తీశారు. దీంతో గ్రామస్తులు వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment