చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు | chandra bimbam 12 th to 18th | Sakshi
Sakshi News home page

చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు

Published Sun, Jan 12 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు

చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. తరచూ ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆక స్మిక ధనలాభం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. వారం చివరిలో ప్రయాణాలు. తగాదాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆర్థిక లావాదేవీలలో పురోగతి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఇంటిలో విందువినోదాలు. వారం మధ్యలో చికాకులు. రుణ ఒత్తిడులు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు. సినీ, టీవీనటులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశకు గురిచేస్తాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన గందరగోళం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనలాభం. కుటుంబసౌఖ్యం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. బంధువర్గం నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. వారం చివరిలో శుభవార్తలు. ఆర్థిక లాభాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కళాకారులకు సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణయత్నాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి విషయాలలో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో వాహనయోగం. పరపతి పెరుగుతుంది.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆశయాల సాధనలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 
 సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఖరీదైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు లేదా స్నేహితులు మీ దరికి చేరతారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. ద్వితీయార్థంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 భానుప్రియ, నటి
 పుట్టినరోజు: జనవరి 15
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement