libra
-
Yearly Horoscope: ఈ ఏడాది రాశి ఫలాలు.. పూర్తి వివరాలు
రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు మేషరాశి ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు. ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1 వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1 మిధున రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4 కర్కాటక రాశి ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4 కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లవ్సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. సింహ రాశి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిష్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి. కన్యా రాశి ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. తులారాశి ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి. ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము. తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కుంభ రాశి ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి. బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. మీన రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. హనుమాన్ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. -పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె) సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023. -
భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత రవీందర్, ధరెంతంటే!
ప్రముఖ నిర్మాణ సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి పెళ్లితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారరు. రెండు నెలల క్రితం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో, వార్తల్లోకెక్కారు. తాము ఒక్కటయ్యామంటూ ఫొటోలు షేర్ చేయడంతో వీరిని ట్రోల్స్ ఆటాడుకున్నారు నెటిజన్లు. దీనికి కారణం నిర్మాత రవిందర్ అధిక బరువు. కేవలం డబ్బు కోసమే రవిందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందని ఈ జంటను టార్గెట్ చేశారు. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అయితే ఈవేవి పట్టించుకుని ఈ జంట తమ దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా భార్యకు కాస్ట్లీ కారు బాహుమతిగా ఇచ్చి తనపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు నిర్మాత రవీందర్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి.. తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత విశేషం. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను’ అంటూ తమిళంలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా భార్యతో కలిసి షో రూం దగ్గర కారు కొంటున్న వీడియోను షేర్ చేశాడు. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి నిర్మాత రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఇచ్చిన ఈ కారు ధర ఆసక్తిగా మారింది. బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని భార్యకు ఆయన గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ. 32 లక్షల వరకు ఉంటుందని అంచనా. కాగా వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే. నటి మహాలక్ష్మికి గతంలో అనిల్ నేరేడిమిలితో వివాహం జరిగగా వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మహాలక్ష్మి 2019లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కుమారుడితో ఒంటరి నివసిస్తున్న ఆమె ఈ క్రమంలో రవీందర్ చంద్రశేఖరన్‌తో ప్రేమలో పడింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by ♜🅼🅰🅷🅰🅻🅰🅺🆂🅷🅼🅸❤️ (@mahalakshmi_actress_official) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
తులా రాశి ఫలాలు 2022-23
చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (పంచమం)లోనూ తదుపరి మీనం (షష్ఠం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (చతుర్థం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (అష్టమం), కేతువు వృశ్చికం (ద్వితీయం)లోను తదుపరి రాహువు మేషం (సప్తమం) కేతువు తుల (జన్మం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (అష్టమం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా గురువు శని కొంతకాలం అనుకూలించడం రాహుకేతువులు సంవత్సరం అంతా అనుకూలింపకపోవడం వల్ల చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎవరినీ నమ్మవద్దు. ఎవరి మీదా ఆధారపడి ఏ పనీ మొదలు పెట్టవద్దు. తరచుగా మోసపూరిత వాతావరణం మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. గురువు కుంభంలో ఉండగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. జూన్ నుంచి కుజుడు ప్రతికూలించడం. గురువు మీనంలో సంచారం చేసేకాలంలో ఆర్థిక వెసులుబాటు సరిగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఋణాలు తీర్చే ప్రయత్నంలో చికాకులు రాగలవు. అవసరానికి కొత్త ఋణాలు అందక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి. పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందవు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రతలు పాటించడం శ్రేయస్కరం. ప్రమోషన్, స్థానచలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. చేస్తున్న వ్యాపారం మానేసి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలం కాదు. వ్యాపారులకు సంవత్సరం అంతా అనవసర ఆలోచనలు కలిగినా, చివరకు లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారిని ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది. ఆహార విహారాల్లో నియమాలు పాటించక, ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలుకొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం అంతా విచిత్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలులో ఎవరి సలహాలూ తీసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంత తేలిగా సాగవు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరైన మార్గంలో సాగవు. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు మోసం చేసేవారు ఎక్కువసార్లు ఎదురవుతారు. విద్యార్థులకు గురువు మీనంలో ఉండగా అనుకూలత తక్కువ. ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. రైతులు తొందరపాటుగా ఎవరి సలహాలు తీసుకోవద్దని, అనవసరంగా ఋణాలు చేయవద్దని సూచన. గర్భిణిలు నిత్యం ‘శ్రీమాత్రే నమః’ నామాన్ని జపిస్తూ ఉండండి. రాహు కేతువుల అనుకూలత తక్కువగా ఉన్నది. చిత్తా నక్షత్రం వారికి సంబంధం లేని అంశాలలో కూడా దోషిగా విచారణ ఎదుర్కోవలసిన పరిస్థితులు తరచుగా ఎదురవుతాయి. మానసిక స్థితి బలహీనమవుతుంది. దురలవాట్లు వున్నవారు ప్రమాదాలలో పడే అవకాశం వుంది. అవివాహితులు వివాహ ప్రయత్నం చేయకుండా వుంటేనే మంచిది. స్వాతీ నక్షత్రం వారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా నిబ్బరంగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. అలంకరణ వస్తువులు, గృహాలంకరణ వస్తువుల కొనుగోలు కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా వుంటాయి. విశాఖ నక్షత్రం వారు ధనసంబంధ లావాదేవీలను సరిగా నిర్వహించక ఇబ్బందుల్లో పడతారు. చేయవలసిన ముఖ్యమైన పనులు వదిలేసి, ఇతర పనులు వెంటపడి సమస్యలను కొని తెచ్చుకుంటారు. బుద్ధిస్థిరత్వం లేకుండా ప్రవర్తించి సమస్యలను పెంచుకుంటారు. శాంతి: రోజూ తెల్లటి పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. తెల్ల జిల్లేడు, గరిక, మారేడుపత్రితో గణపతి దేవాలయంలో నిత్యం అర్చన చేయించండి. తొమ్మిది ముఖా రుద్రాక్షధారణ విశేషం. ఏప్రిల్: పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఈ నెల వృత్తిరీత్యా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. శుభ కార్యాల్లో శుభవార్తలు వింటారు. పుణ్యకార్యాల్లో పొల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. రాహు, కేతు గ్రహశాంతి చేయించండి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య అనుకూలత ఉంటాయి. ప్రమోషన్ అవకాశం ఉంది. మే: ఓర్పుగా వ్యవహరించండి. ఇబ్బందులు ఉండవు కాని, తొందరపాటును విడనాడాల్సిన కాలం. చివరివారంలో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు 23వ తేదీ నుంచి ఒత్తిడి కలిగిస్తాయి. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. జూన్: పరిస్థితులతో సంబంధం లేకుండా ధైర్యం ప్రదర్శిస్తారు. శుక్ర సంచారం బాగుంది. వచ్చిపడే సమస్యలను తెలివిగా దాటవేయగలుగుతారు. వాహన చికాకులు తరుచుగా ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు చేసే వారికి చికాకులు ఉంటాయి. తెలియకుండా చేసిన పనుల వల్ల ఇబ్బందికర సంఘటనలు ఎదురవుతాయి. జూలై: రానున్న మూడు నెలల్లో కుజుడి అనుకూలత లేదు. ప్రతినెలా కుజ గ్రహశాంతి అవసరం. అంతేకాదు ఇక్కడి నుంచి శని రాహు గురు కుజ కేతు గ్రహచారం కూడా అనుకూలం కాదు. ఇది మిమ్మల్ని భయభ్రాంతులను చేయడానికి చెప్పే అంశం కాదు. తగు జాగ్రత్తలతో వ్యవహరిస్తారనే ఉద్దేశంతో సూచిస్తున్నాము. నవగ్రహారాధన చేయండి. ఆగస్టు: అంగారక సంచారం దోషం అష్టమంలో ఎక్కువకాలం ఉంటుంది. జన్మ జాతకంలో కుజుడు దోషసంచారంలో ఉన్నవారికి >ఇబ్బందులు ఎక్కువ కాగలవు. అందువలన మీ వ్యక్తిగత జాతకాన్ని ఈ నెలలో తప్పనిసరిగా శోధన చేయించుకోండి. ఉద్యోగ, వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్: 15వ తేదీ వరకు రవి, 24వ తేదీ వరకు శుక్రుడు అనుకూలిస్తారు. ఏదో ఒక విధంగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెడతారు. గతమాసం కంటే మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా పనులు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది. అక్టోబర్: రవి కుజ శని గురు, బుధ, రాహు, కేతు అనుకూలత సరిగా లేదు. ప్రారంభంలో శుక్ర సంచారం కూడా సరిగాలేదు. ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ప్రతి పనిలోనూ చికాకులు ఉంటాయి. ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేయించుకోండి. అవకాశం చూసుకొని నవగ్రహ హోమం చేయించుకోండి. నవంబర్: మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. కేవలం శుక్ర సంచారం అనుకూలతతో ఈ నెల మంచి ఫలితాలు అందుకుంటారు. అడ్డంకులు ఎదురవుతున్నా, విజయం సాధించగలమనే ధైర్యంతో ముందుకు వెడతారు. అయితే ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మితభాషణ, ఓర్పు ఈ నెలలో మీకు శ్రీరామరక్ష అని గ్రహించండి. డిసెంబర్: సహాయం చేయవలసిన సమయానికి మిత్రులు సహకరించపోవడంతో చాలా నిరుత్సాహం చెందుతారు. ప్రతి పనీ ఒత్తిడితో పూర్తవుతుంది. అయితే నష్టాలు ఉండవు. అనవసర ఆందోళనలు ఎక్కువ. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు వృథా కాలక్షేపం చేస్తారు. జనవరి: చాలా అద్భుతమైన కాలం. గురు, రాహు, కుజ అనుకూలత లేకపోయినా, మిగిలిన గ్రహాల అనుకూల సంచారం వల్ల చాలా లాభాలు అందుకుంటారు. ప్రధానంగా ఈ నెల ప్రశాంతత ఎక్కువ. గతం నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారాలు సాధించడంలో గొప్ప నేర్పు ప్రదర్శిస్తారు. విచిత్రంగా ఉంటుంది ఈ కాలం. ఫిబ్రవరి: బంధువులు, స్నేహితులతో కలసి చేసే పనులు, సంచారాలు మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. మితభాషణ చాలా అవసరం.అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. «కావలసిన సమయానికి డబ్బు అందకపోవడం, ఋణాల విషయంలో హామీలు సరిగా ఉండకపోవడం జరుగుతుంది. మార్చి: ఒక విచిత్రకాలం. గురు శుక్రుల అనుకూలత తక్కువ. ప్రతి పనిలోనూ కోపతాపాలకు లోనవుతారు. ఆరోగ్య విషయంలో ఉష్ణప్రకోపానికి లోనవుతారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో ధన సౌకర్యం సరిగా అందదు. తరచుగా వాహన చికాకులు ఉంటాయి. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
శార్వరి నామ సంవత్సర (తులా రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు, కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కొత్తకోణంలో ఆలోచనచేసి నూతనమైన పద్ధతులు కనిపెట్టాలని యోచిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాముల ఖర్చు ఉమ్మడి ఖాతాలలో వాడకం వాటాలను దాదాపు మించిపోతుంది. ఇలాంటివి సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు జలవనరులు మీరు ఆశించిన చోట ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అభివృద్ధి చెందటం, వాళ్ళ వల్ల పేరుప్రతిష్ఠలు రావడం సంతోషం కలుగుతుంది. అదనపు బరువుబాధ్యతలు తప్పవు. సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు. మీరు చేస్తున్న అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావలసిన బాకీలు కొద్దికొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించే మీ ఆందోళన. వడ్డీల మీద ఆశపెట్టుకోరు. బంధువర్గం, దగ్గరివాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు సాయం చేయవలసిన పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు. మీకు ప్రతికూలంగా మాట్లాడుతారు. అభివృద్ధి చెందుతున్న పిల్లల మొహం చూసి కూడా వాళ్ళ అభిప్రాయాలలో మార్పురాదు. ఉన్నవాళ్ళకు ఇంకా మేలు చేయాలని అన్యాయమైన పంచాయితీలు చేస్తారు. ఎదిరించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. నమ్మకం పెట్టుకున్నందుకు, మీ పొరపాటుకు ఈ శిక్షపడాల్సిందేనని మీరే మౌనంగా బాధను దిగమింగుకుంటారు. మీరు అనుకున్నది, ఆశించినది, కృషి చేసినది నిజంగా మీదే అవుతుంది. ఆర్థికస్థితిలో మార్పు వస్తుంది. ఇతరులకు జవాబు చెప్పవలసిన పనిలేదు. ఉంటే తింటాం లేకపోతే లేదు. బయటవారితో మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి లేదు అన్న భావన చాలా ఊరట కలిగిస్తుంది. అన్నిరకాల దేవుళ్ళ అభిషేకాలకు, పూజలకు మహాతీర్థం పొడి ఉపయోగించండి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు శాస్త్రపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దానికి వంకలు పెట్టే వాళ్ళని సంతృప్తిపరచలేమని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ పుస్తకాలు, ఎలక్ట్రానిక్ సామాగ్రి, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలలో లాభాలు వస్తాయి. నిష్కారణమైన ద్వేషానికి మందు కనిపెట్టలేమని గ్రహించి ఊరట చెందండి. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మీకు అన్యాయం చేస్తారని విచారించవద్దు. మీ ప్రయోజనాలు రాచబాటలో వస్తాయి. మీ సన్నిహిత రాజకీయవర్గం డబ్బులు తీసుకుని మీ వ్యతిరేక వర్గానికి మేలు చేస్తారు. దీర్ఘకాలిక పోరాటానికి మీరు సంకల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏకపక్ష నిర్ణాయాలు తీసుకోకుండా ఏదైనా పని చేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. శాడిస్టు మనస్తత్వం కలిగిన అధికారుల వల్ల ఇబ్బందిపడతారు. పెయింటింగ్, ఆర్ట్ డిజైనింగ్లకు మంచి ఖ్యాతి లభిస్తుంది. పొదుపు చేసిన ధనాన్ని సక్రమమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గిస్తారు. వీలైనంత పొదుపుగా కాలం గడపాలని చూస్తారు. అయితే సాంతం త్యాగం చేయరు. ఇతరులకు పెట్టే వాటిల్లో లోటు చేయరు. అనవసరమైన వ్యక్తుల సలహాలను దూరంగా పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత విషయాలలో బంధుమిత్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మెరిట్మార్కులు సాధిస్తారు. సంతానాన్ని అధికగారాబం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోకండి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు, పొలాలకు మంచి ధర లభిస్తుంది. అమ్మాలన్న ఉద్దేశ్యంతో కొనుగోలు చేసిన ఓ ఫ్లాట్‌ను అమ్మి ధనాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు. బంధువుల మధ్య తగాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామికి కానీ, మరొకరికి కానీ సంజాయిషీ ఇవ్వాల్సి రావడం మీ మానసిక అసహనానికి కారణం అవుతుంది. సమాజంలో మీకున్న గుడ్‌విల్‌ను నిలబెట్టుకోగలుగుతారు. ఒక యూనిట్‌గా చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. కష్టపడకుండా ఎలాంటి ఫలితాలను ఆశించరు. మనస్సు విప్పి మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. శుభకార్యాల నిమిత్తం బంధువులకు సహాయం చేస్తారు. ఇబ్బందికరంగా మారిన పెళ్ళిని కష్టతరంగా పూర్తిచేస్తారు. బంధువులలో ఐకమత్యం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు సాధించిన పురోగతి, ఆర్థికస్థితి, పేరుప్రతిష్ఠలు చూసి సంతోషించే ఏకైక ఆత్మీయుడు లేకపోవడం మీ తీవ్రమనోవేదనకు కారణం అవుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థికబలం పెరుగుతుంది. పోలీస్‌స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా స్నేహితులను ఆదుకోవడానికి మీ పలుకుబడిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలను, కులాంతర వివాహాలను మీరు సరిపెట్టుకోలేరు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడరు. కొన్ని సందర్భాలలో చేతినిండా పని ఉంటే బావుండు, క్షణం తీరిక లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. రుద్రజడను ఉపయోగించండి. కొన్ని వ్యాపార సంబంధమైన విషయాలకు మీరు నాయకత్వం వహిస్తారు. మంచి లాభాలు సాధిస్తారు. లాభాలు పంచుకునే విషయంలో పనిచేయని వ్యక్తులకు, సోమరిపోతులకు భాగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది మీ మనోవేదనకు కారణం అవుతుంది. దొంగకు, దొరకు ఒకే న్యాయం. ఇది మీరు జీర్ణించుకోలేకపోతారు. కుటుంబసభ్యుల సంతోషం కోసం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారు. సివిల్ సర్వీస్‌లలో విజయం సాధించడానికి ఎంతో కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మనస్సుకు ఊరట కలుగుతుంది. మీ మీద ఉన్న బాధ్యతలు స్నేహితుడిలా గుర్తుచేస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువగా ఆలోచన చేయకుండా శుభకార్యాలను ఘనంగా చేస్తారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిని ఇతరుల సహాయంతో చేసి వచ్చిన లాభాలలో వారికి వాటా ఇచ్చి, వారిని సంతృప్తిపరుస్తారు. వ్యక్తిగత బలహీనత కలిగిన అధికారి మీ చేతికి చిక్కుతాడు. అతని సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను సాధించుకుంటారు. నమ్మకం లేకపోయినా, ఎదుటివారి నిర్ణయం వల్ల, అనాలోచిత చర్యల వల్ల ఎంతో ప్రయోజనం పొందాల్సిన ఓ వ్యవహారంలో కొద్దిపాటి లాభాలు మాత్రమే దక్కుతాయి. వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయడం మంచిది. మీ ఆత్మీయవర్గం మీ శత్రువర్గం ఎప్పుడూ మీ కార్యక్రమాలపై, మీరు చేసే పనులపై నిఘా ఉంచుతారు. మీ ఆత్మీయవర్గం మీ ఎదుగుదలను సహించలేరు. మీ ఎదుగుదలలో మీరు తొక్కిన అడ్డంకులను ప్రచారం చేస్తారు, విమర్శిస్తారు. స్త్రీల సహాయనిరాకరణ వల్ల, వాళ్ళతో ఏర్పడిన విభేదాల వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతరాత్మ ప్రబోధానుసారం కొన్ని కార్యక్రమాలను వదిలివేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. కొన్ని ప్రయోజనాలు వదులుకొని మీ పెద్దరికం, మర్యాదను సమాజంలో నిలుపుకుంటారు. మీడియా ప్రతినిధులతో సాంగత్యం ఏర్పడుతుంది. కష్టసుఖాలను సరిసమానంగా చూస్తారు. ఏది కోల్పోయినా మనోధైర్యం మాత్రం కోల్పోరు. వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాలు చేతికి అందడానికి సాంకేతిక కారణాలు అడ్డువస్తాయి. శక్తికి మించి శ్రమిస్తారు. అందరూ కూడి వచ్చి సహాయం చేస్తామని చెబుతారు. సమస్యలు మొదలుకాగానే మొహం చాటేస్తారు. కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు. రెండో మూడో కలిసొస్తాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి అధికారులు చికాకు పెడుతున్న తరుణంలో అండగా ఉంటాడు అని భావించిన వ్యక్తి విరోధంతో దూరం కావడం జరుగుతుంది. ఈ సమస్యల వలయం నుంచి బయటకు రావవాల్సిన స్థితిలో ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్యం, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వాటిని అధిగమిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ గండం నుండి బయటపడతారు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారికి గట్టిగా బుద్ధి చెబుతారు. వాళ్ళని ఎవరూ నమ్మకుండా బహిష్కరించే విధంగా చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. సెంటిమెంట్స్ ప్రకారం వ్యాపారంలో ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలలో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు మిమ్ములను నమ్మకంలోకి తీసుకుంటారు. రాజకీయ జీవితంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. చలనచిత్ర రంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. విదేశాలలో నివసించేవారు స్వగృహం కొనుగోలు చేస్తారు. గ్రీన్‌కార్డు, స్టాంపింగ్ వంటివి అనుకూలిస్తాయి. -
ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీపై జీ–20 దేశాల దృష్టి
లండన్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్‌పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్బుక్ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఫేస్బుక్ ప్రాజెక్టు లక్ష్యాలు భారీగానే ఉన్నాయని, అయితే నిబంధనలకు లోబడే అది పనిచేయాల్సి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ గవర్నర్ ఫ్రాంకోయిస్ విల్రాయ్ డి గాల్ చెప్పారు. ఫేస్బుక్ క్రిప్టోకరెన్సీకి అనుమతులివ్వడం అంత ఆషామాషీ కాదని, నియంత్రణ సంస్థలతో చర్చించకుండా దీన్ని ప్రవేశపెట్టడం కుదరదని ఇంగ్లండ్‌కి చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రాధికార సంస్థ చీఫ్ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. ఈ వారాంతంలో జీ20 దేశాల నేతలు జపాన్‌లో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే లిబ్రా కాయిన్స్‌ను వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని ఫేస్బుక్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో లావాదేవీల వ్యయాలు గణనీయంగా తగ్గుతుందని, మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవొచ్చని ఫేస్బుక్ చెబుతోంది. కంపెనీకి రెండు వందల కోట్ల పైగా యూజర్లు ఉండటంతో ఆర్థిక లావాదేవీలపై ఇది గణనీయ ప్రభావం చూపించవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, క్రిప్టో కరెన్సీల భద్రతపై సందేహాలుండటం, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వీటిని నిషేధించడం కారణంగా ఫేస్బుక్ లిబ్రా కాయిన్ చర్చనీయాంశమైంది. -
ఫేస్బుక్ నుంచి కొత్త క్రిప్టో కరెన్సీ
లండన్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల ఆమోదముద్ర గల కొత్త క్రిప్టోకరెన్సీకి సంబంధించిన విషయాలను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని రూపకల్పన కోసం లిబ్రా పేరిట ప్రత్యేక కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వీసా, మాస్టర్‌కార్డ్, పేపాల్, ఉబెర్ వంటి డజను పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, టెలికమ్యూనికేషన్స్ సంస్థలతో పాటు ఈ కంపెనీలు ఒక్కొక్కటి కనీసం 10 మిలియన్ డాలర్లు ఈ కన్సార్షియంలో ఇన్వెస్ట్ చేస్తాయి. సంక్లిష్టమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత వర్చువల్ కరెన్సీలతో (బిట్‌కాయిన్ వంటివి) సామాన్యులు భారీగా నష్టపోయే ప్రమాదంతో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దీన్ని నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఫేస్బుక్ నుంచి క్రిప్టోకరెన్సీ వస్తోందన్న వార్తల నేపథ్యంలో బిట్‌కాయిన్ రేటు గణనీయంగా పెరిగింది. 2018 మే తర్వా త తొలిసారిగా 9,000 డాలర్ల స్థాయి పైకి చేరింది. -
ఎంఎంటీసీ నుంచి ‘తుల’ గోల్డ్ కాయిన్
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పసిడి, వెండి రిఫైనర్- మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాంప్ (ఎంఎంటీసీపాంప్) ‘తుల’ పేరుతో 11.6639 గ్రాముల పసిడి నాణేన్ని విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల నాణేలను ముద్రించనున్నట్లు ప్రకటించింది. 999.9 ప్యూర్ గోల్డ్‌తో దీనిని సంస్థ తయారు చేసింది. త్రాసుతోపాటు భారత పురాతన సంప్రదాయాలు ప్రతిబింబించేలా నాణేన్ని రూపొందించినట్లు ఎంఎంటీసీ పాంప్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేశ్ ఖోస్ల తెలిపారు. ‘తుల’ కాయిన్ తొలుత ఎంఎంటీసీపీ ఔట్‌లెట్స్‌లో, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు, అలాగే ప్రముఖ ఆభరణాల షాపుల్లో లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఎంఎంటీసీ, స్విట్జర్లాండ్ పీఏఎంపీ సంయుక్త భాగస్వామ్యంతో ఎంఎంటీసీ పాంప్ ఏర్పాటయ్యింది. -
చంద్రబింబం: మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికరంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులలో ఆటంకాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త పనులకు శ్రీకారం. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. రుణయత్నాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యం. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో విందువినోదాలు. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. -
చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. తరచూ ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆక స్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. వారం చివరిలో ప్రయాణాలు. తగాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలలో పురోగతి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఇంటిలో విందువినోదాలు. వారం మధ్యలో చికాకులు. రుణ ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు. సినీ, టీవీనటులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశకు గురిచేస్తాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన గందరగోళం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనలాభం. కుటుంబసౌఖ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. బంధువర్గం నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. వారం చివరిలో శుభవార్తలు. ఆర్థిక లాభాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కళాకారులకు సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణయత్నాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి విషయాలలో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో వాహనయోగం. పరపతి పెరుగుతుంది. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆశయాల సాధనలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఖరీదైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు లేదా స్నేహితులు మీ దరికి చేరతారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. ద్వితీయార్థంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... భానుప్రియ, నటి పుట్టినరోజు: జనవరి 15