చంద్రబింబం: మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) | Asrtology arius | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

Published Sun, May 18 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

Asrtology arius

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికరంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులలో ఆటంకాలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 కొత్త పనులకు శ్రీకారం. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. రుణయత్నాలు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యం. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనలాభం.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో విందువినోదాలు. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement