virgo
-
కన్య రాశి: చారానా సంపాదన బారానా ఖర్చు, కానీ స్త్రీలకు ప్రత్యేకం!
ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 కన్యారాశి వారికి ఈ సంవత్సరం సప్తమ అష్టమస్థానాలలో గురురాహువుల సంచారం, షష్ఠమ స్థానంలో శని, లగ్న ద్వితీయాలలో కేతుగ్రహ సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఉన్నతస్థానాన్ని అధిరోహించే అవకాశాలు లభిస్తాయి. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు, సేవాసంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, వ్యవహారాలపరంగా బాగుంది. రాజకీయంగా అగ్నిపరీక్షాకాలం. విద్యాసంబంధమైన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీలు బాగా సాగుతాయి. ఆక్వారంగంలో, పౌల్టీర్రంగంలో కలిసిరాదు. ఈ సంవత్సరం ప్రధానమైన విషయాలు బాగున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు పరిశీలించుకోవడం మంచిది. ఫైనాన్స్ స్కీములలో చేరవద్దు. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుకుంటారు. ఇతరులు రెచ్చగొట్టే యత్నాలు చేసినా ఓర్పు వహించి వ్యాపార, ఉద్యోగాలను పదిలపరుచుకోండి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కొత్తగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు నడిపే విషయంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయపడతారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందులపాలు చేయగలుగుతారు. మీపై వచ్చిన ఆరోపణలు మరుగున పడతాయి. విదేశాలలో స్థిరపడిన ఆత్మీయవర్గంతో కలిసి తాత్కాలిక వ్యాపారాలు చేస్తారు. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల అనారోగ్యం కలుగుతుంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యం అవుతుంది. ప్రేమవివాహాలు కలిసిరావు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు పొడగించబడతాయి. స్థిరాస్తుల పంపకం వ్యవహారంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. గృహశాంతి పాడు చేసుకోవడం ఇష్టం లేక జీవితంలో నటించాల్సి వస్తుంది. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. మీ వైరివర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ పదవి సంప్రాప్తిస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత శత్రువులు మళ్ళీ తెరమీదకు వస్తారు. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. చాలా సందర్భాలలో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సి వస్తుంది. సంతానం కొన్ని విషయాలలో వక్రమార్గంలోకి వెళ్తారు. విందులు, వినోదాలు ఎక్కువవుతాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ కప్పుసాంబ్రాణితో ధూపం వేయండి. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్స్‌కి దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మొత్తంమీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం.. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. క్రీడారంగంలో కొన్ని విజయాలు నమోదు చేసుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, వైరాగ్యం, గతస్మృతులు మనోవేదనకు కారణం అవుతాయి. అన్నీ ఉన్నా అనుభవించలేకపోతున్నామనే భావన మీ మనసును కలవరపరుస్తుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుందనే భావన పదేపదే అనిపిస్తుంది. కీర్తిశేషులైన రక్తసంబంధీకుల జ్ఞాపకాలు బాధిస్తాయి. విద్యా, కళా, సాహిత్యరంగాలలో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు కలిసివస్తాయి. సమాజంలో మీరొక సెలబ్రిటీ అవుతారు. ప్రతిరోజు నుదుటన యజ్ఞభస్మం ధరించండి. సమాజంలో నెలకొన్న కుల, మత, వర్గ ప్రాంతీయ వైషమ్యాలు మీకు నష్టం కలిగిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా వుంది. మీ పేరుమీద ఉన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. మీ వ్యక్తిగతమైన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, సెల్‌పోన్, కంప్యూటర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొదలగు వాటి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. నూతనమైన వస్త్రాలు ఎక్కువగా ధరిస్తారు. సనాతన సాంప్రదాయల పట్ల మొగ్గు చూపిస్తారు. నానారకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. పొదుపు చేసిన ధనంతో ఏదైన స్థలం కానీ, ఫ్లాట్ కానీ తీసుకోవాలని అనుకుంటారు. మీ మీద ఆధారపడిన వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందజేస్తారు. మనసులోకి ఎవరినీ రానీయకూడదు, ఎవరికీ చోటు ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారు. మీరు మనసులో స్థానమిచ్చి, జీవితాన్ని పంచుకుందామని భావించిన వ్యక్తి మోసం చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు లోనవుతారు. ఇది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు. మీ వల్ల కాదని అందరూ హేళన చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తిచేసి, ప్రశంసలు అందుకుంటారు. తెలివిగా ఆలోచించండి. చిరునవ్వుల వెనుక ఉన్న వైషమ్యాన్ని జాగ్రత్తగా గమనించండి. పొగిడిన వాళ్ళంతా మీ అభిమానులు కారు. వెన్నుదట్టిన వాళ్ళందరూ మీ హితులు కారు. కాలం మీకు అనుకూలంగా ఉన్నంత వరకే. మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రానంత వరకే వాళ్ళ ప్రేమాభిమానాలు పరిమితమవుతాయి. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. వివాహం కానివారికి వివాహప్రాప్తి, సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. సాంకేతిక, కళారంగాలలో రాణిస్తారు. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఇందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. సాంస్కృతిక కార్యక్రమాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా ఉపయోగం లేకపోయినా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మీరే మరిచిపోతారు. భగవంతుడిని నమ్మండి, ఆరాధించండి. చార్టెడ్ అకౌంటెంట్స్‌కు, సివిల్ ఇంజనీర్లకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, విద్యాసంస్థలు నడిపే వారికి కాలం చాలా అనుకూలంగా వుంది. గతంలో చేసిన పొరపాట్లను తిరిగి జరగకుండా జాగ్రత్తపడతారు. ఒకానొక సందర్భంలో మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులే కరువవుతారు. చివరికి పెద్దలు, తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలంగా వుంది. -
కన్యా రాశి ఫలాలు 2022-23
ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (షష్ఠం)లోను తదుపరి మీనం (సప్తమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (పంచమి)లోను మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (భాగ్యం) కేతువు వృశ్చికం (తృతీయం)లోను తదుపరి రాహువు మేషం (అష్టమం), కేతువు తుల (ద్వితీయం)లోను సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (భాగ్యం)లో స్తంభన. ఈ గోచార ప్రభావం వల్ల ఏప్రిల్ నుంచి అనవసర భయాందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కావలసిన పనులు చేయడం కంటే అనవసర వ్యవహారాలపై దృష్టి పెంచడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. కింది ఉద్యోగులు, పనివారి వల్ల చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. గురువు మీన సంచారం ప్రారంభమైనప్పటి నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినా, మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. రోజువారీ విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి. సమయపాలన లేక రోజువారీ పనుల్లోనూ చికాకులు పెరుగుతాయి. స్థానచలన ప్రయత్నాలను స్వయంగా చేసుకోకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణిని అవలంబించి సానుకూలత సాధిస్తారు. ఋణసౌకర్యం ఏప్రిల్ నుంచి నాలుగు నెలలకాలం అనుకూలం. అయితే దూరప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన. గత సంవత్సరం కంటే కొన్ని అంశాలలో మంచి ఫలితాలు అందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు గాని, చేస్తున్న వ్యాపారం మానడం, మారడం వద్దు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమకు తగిన ఫలితాలు ఉండవు. అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు. అధికారులతో తరచు ఇబ్బందులు వస్తాయి. అయినా నష్టం లేకుండా వీలయినంతవరకు లాభసాటిగానే ఉంటారు. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే ఏదో అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబసభ్యుల కోసం కూడా అనవసర అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లలో మే నెల తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కార్యసాఫల్యం ఉంది. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి, సానుకూలంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనవసర చికాకులు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. రైతులకు సొంత నిర్ణయాలతో చేసే వ్యవసాయం లాభాన్ని ఇస్తుంది. ఇతరుల సలహాలు వద్దు. గర్భిణీస్త్రీలు ఏప్రిల్ నుంచి రాహు ప్రభావం వల్ల ఒత్తిడికి లోనవుతారు. జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరా నక్షత్రం వారికి కాలం బాగా అనుకూలిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ విషయంలో చాలా విశేషంగా దృష్టి కేంద్రీకరించి, బంధుమిత్రులకు దగ్గరవుతారు. వృత్తిపరంగా ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వారు ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. మీ పనుల్లో సహాయం కోసం ఎవరినీ అర్థించవద్దు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత మీకు చాలా శ్రేయస్కరం. గతంలో చేసిన పొరపాట్లు తరచు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో గౌరవానికి భంగం కలుగుతుంది. చిత్త నక్షత్రం వారు అన్నవస్త్రాలు కూడా సరిగా అమర్చుకోలేనంతగా పనుల్లో తలమునకలై వుంటారు. భయం, అగౌరవం, శ్రమకు తగిన లాభం లేకపోవడం నిరాశ కలిగిస్తాయి. మితిమీరిన పని తప్పించుకోవడం కుదరక సతమతమవుతారు. గతం కంటే పరిస్థితి బాగుంటుంది. శాంతి: గురువుకు శాంతి చేయించండి. ఏప్రిల్ 15వ తేదీ తరువాత రాహువుకు జపం చేయించండి. రోజూ ఉదయం ఎర్రటి పుష్పాలతో జగదాంబను అర్చించి, ఆ తర్వాతే రోజువారీ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ఏప్రిల్: ఒక విచిత్రమైన అద్భుత మాసం ఇది. మంచి మార్పులు ప్రారంభమవుతాయి. అయితే అన్నీ లాభదాయకంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. గురు రాహువులకు శాంతి చేయించండి. మే: అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని స్థితి. అయినా ధైర్యంగా ఉంటారు. ఇతరుల విషయాలలో కలగజేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి.. మితభాషణ అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండటం అవసరం. జూన్: రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. తరచుగా చెడు వార్తలు వింటారు. భోజన అసౌకర్యం తరచుగా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందికరమైన కాలం. కుటుంబ కలçహాలు రాకుండా జాగ్రత్తపడండి. ఖర్చులను నియంత్రించుకోవడం భవిష్యత్తుకు మంచిది. ప్రయాణాలు తగ్గించుకోండి. జూలై: నెల ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమంగా అన్ని సమస్యలనూ చక్కదిద్దుకుంటారు. 15వ తేదీ నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అష్టమ కుజుడి ప్రభావం ఇబ్బందికరం. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది. అవసరానికి కావలసిన ఋణాలు సాధిస్తారు. ఆగస్టు: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పెద్ద సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. సెప్టెంబర్: ఎంత తెలివి, ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తరువాత పనులు వేగం పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోను, అధికారులతో జరిపే సంభాషణల్లోను జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర∙ప్రయాణాలు తగ్గించుకోండి. అక్టోబర్: చిన్న చిన్న చికాకులు మినహా మిగిలిన అన్ని అంశాలూ అనుకూలం. ఈ నెలలో కేవలం రవి సంచారం అనుకూలత తక్కువ. ధన ఋణ కుటుంబ అంశాలు అనుకూలం. అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు ప్రారంభించగానే శుభ సూచనలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కాలం అనుకూలం. నవంబర్: కొత్త కొత్త ప్రయోగాలు తలపెట్టవద్దు. అలంకరణ వస్తువుల విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అందరినీ గౌరవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంఘిక కార్యకలాపాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. పుణ్యకార్యాలపై దృష్టి సారిస్తారు. డిసెంబర్: చాలా మంచి కాలమనే చెప్పాలి. అనుకోకుండా పనిలో శ్రమ తొలగుతుంది. చాలా విషయాల్లో సానుకూలత ఉంటుంది. దైవబలంతో విజయపరంపర బాగా సాగుతుంది. అందరూ బాగా సహకరిస్తారు. గౌరవిస్తారు. తరచుగా శుభకార్య పుణ్యకార్యాల్లోను, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లోను పాల్గొంటారు. జనవరి: చివరి వారంలో చికాకు పడతారు కాని, 22వ తేదీ వరకు అంతటా విజయం సాధిస్తూ ముందుకు వెడతారు. రోజువారీ పనుల్లో ఏ సమస్యలూ ఉండవు. చివరి వారంలో స్నేహితులతో జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందికర పరిస్థితులను ముందుగానే గుర్తించి, వాటిని దాటవేస్తారు. ఫిబ్రవరి: శుక్ర సంచారం సరిగాలేదు. కుటుంబ విషయంలో చికాకులు రాగలవు. ఆర్థిక వెసలుబాటు బాగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఖర్చులు పెరిగినా, తగిన ఆదాయం, ఋణసౌకర్యం చేకూరుతాయి. విద్యా ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. మార్చి: సర్వసాధారణంగా రోజువారీ కార్యములు చక్కగానే చేస్తుంటారు. అయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నష్టములు ఉండవు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలరుగాని, పనులు పూర్తయ్యేంత వరకు మానసికంగా చికాకులు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు అనుకూలం. ఋణ సదుపాయము అనుకూలం. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
శార్వరి నామ సంవత్సర (కన్యా రాశి) రాశిఫలాలు
ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహయోగం అనుకూలపడతాయి. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. స్నేహితులు, బందువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపారరంగంలోని వారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడువంతులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. సివిల్, క్రిమినల్ కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహాల గురించి, ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోరు. విదేశాల నుండి వచ్చే ఆర్థికసాయంతో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. స్త్రీతో వైరానికి ముందుకు దూకవద్దు. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతులకు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. మధ్యమధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయము ధనంతో ముడిపడి ఉందని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. మీ పెద్దలపరంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానాన్ని చదువులకోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల్లో చేరడం వల్ల, చిట్టీలు కట్టడం వల్ల నష్టపోతారు. ప్రైవేటు ఆర్థిక సంస్థలలో పెట్టిన డబ్బు పోతుంది. ధనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు. మీ స్నేహితుల రాజకీయ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తారు. మీ వంతు సహాయం మీరు అందిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్, ఆహారధాన్యాల వ్యాపారం బాగుంటుంది. కొన్నిచోట్ల భూమి ధర పడిపోతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, లాభాలు అయోమయంగా ఉంటాయి. సోదరసోదరీ వర్గంతో సంబంధబాంధవ్యాలు బలపడతాయి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువుబాధ్యతలు తీర్చుకోగలిగామన్న సంతృప్తి కలుగుతుంది. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్సులు, లీజులు పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు. ఉద్యోగం చేయడం కత్తిమీద సాముగా తయారవుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే, పదిమందికి చెడు అనిపిస్తుంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్‌లో వివాదస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి ప్రయోజనాలు వదులుకుంటారు. మీడియాపరంగా చికాకులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పూజించండి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు లభిస్తాయి. అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి. రెండు నెలలు గృహంలో ఐకమత్యం లోపిస్తుంది. రాజకీయ పదవి లభిస్తుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఊహలు, అపోహలు, ప్రక్కనపెట్టి నిజజీవితంలో బ్రతకడం చెప్పదగిన సూచన ఇంటి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగువేయండి. చేతివృత్తి పనివారికి, హోల్‌సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. ఇతరులు మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. మీ హితవు కోరే పెద్దలను, ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రయాణాలలో వస్తుభద్రత గురించి గట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వివాదాలతో కాలాయాపన చేసే మీ వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీ సాటివారికి, తోటివారికి అసూయ పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేయండి. రహస్య చర్చలు, సంభాషణలు, కాలయాపన చేయటం మంచిది కాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు, జాగ్రత్త వహించండి. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. యోగాసనాలు, మెడిటేషన్ వంటి విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. మీ ఇంటి ఆడపడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. ఎంతోకాలం క్రితం సంభవించిన మహాప్రస్థానం మీ మనస్సు మీద చెప్పలేని ప్రభావం చూపిస్తుంది. కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది. మీరు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు, తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. అయిన వాళ్ళు, ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షకపాత్ర పోషించవలసి వస్తుంది. అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు. ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ ఒక్క విషయంలో పొరపాటు నిర్ణయం తీసుకుంటారు. ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేయరు. మీ ఆత్మీయులను, కష్టాలలో ఉన్న స్నేహితులను, బంధువులను కష్ట సమయంలో ఆదుకుంటారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు. కళా, సాహిత్య, సంగీత రంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త వహించండి. సోదరసోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. మీకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలకు మీరే బాధ్యతవహించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా పోటీ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయవర్గంతో కొద్దికాలం విభేదాలు కలుగుతాయి. స్పెక్యులేషన్లో నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించడానికి విధిలేని పరిస్థితులలో మీరు మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. ఓ శుభకార్యానికి కూడా మీరే మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. ఇందువల్ల ప్రయోజనం లేకపోగా మీపై అనవసర నిందలుపడతాయి. రుద్రజడ వాడండి. వివాదస్పదమైన ఆస్తి కలిసివస్తుంది. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఐ.టి వంటి ఉన్నత పరీక్షలకు ఎంపిక అవుతారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఆరోగ్య వృద్ధికోసం చేసే నూతన విధానాలు మంచి ఫలితాలనిస్తాయి. స్వయంకృతాపరాధాల వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగినది కాదు. -
వికారినామ సంవత్సర (కన్యా రాశి) రాశిఫలాలు
కన్యారాశివారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. చతుర్థంలో శని కేతువుల సంచారం, చతుర్థ పంచమంలో గురుగ్రహ సంచారం, దశమంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కృంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇతరుల కుయుక్తులు వీరిపై ప్రభావం చూపవు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీలేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన సంబంధమైన వ్యాపారాలలో రాణిస్తారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధకలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ప్రక్కనపెట్టి మీ విషయం వచ్చేటప్పటికి అందరూ ఏకం అవుతారు. స్వంతవర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు. అత్యున్నతస్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు. మేధస్సు, స్వీయవిద్య, సాంకేతికపరిజ్ఞానం అక్కరకు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ప్రజాసంబంధమైన విషయాలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతాన పురోగతి ఆశించినంత సంతృప్తి కలిగించదు. అనేక రకాల ఆలోచనలను, మీ అంతర్గత భావాలను, కోపాన్ని అదుపు చేసుకుని మనసులో ఒకవిధంగా, పైకి ఒకవిధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయవర్గం కూడా సహించలేరు. మీరు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తులతో, మీ కుటుంబ సభ్యులు సన్నిహితంగా మెలగడం మీ మనోవేదనకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక కాంట్రాక్టుల పట్ల విముఖత ఏర్పడుతుంది. వివాదస్పద వ్యవహారాలు విసుగు పుట్టిస్తాయి. రాజకీయపరమైన అవకాశాల కోసం వ్యూహం సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. చాలా సందర్భాలలో ఆంతరంగికమైన భేదాభిప్రాయాలు వస్తాయి. కీళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోని వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇష్టం లేకపోయినా కొందరు భాగస్వాములతో కలసి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఒత్తిడుల నుండి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. మీ సహాయ సహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మెడిసిన్ సీటు వస్తుంది. సంవత్సరం ప్రథమార్ధంలో ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు సహాయం చేస్తారు. ఇంకొకరికి సహాయం చేసే విధంగా మీ స్థాయి పెరుగుుతుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యావంతులు, మేధావులు అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు కాకతాళీయంగా మీకు సన్నిహితులవుతారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. జనులను ఒప్పించి, మెప్పించి మీరు అనుకున్న స్కీములలో చేర్చగలుగుతారు. లైసెన్సులు, లీజులు పునరుద్ధిరింపబడతాయి. మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. చాలా విషయాలలో మీ అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమే వాస్తవంలో మీకు జరిగే కీడు ఏమీ ఉండదు. విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సీడీలు, అధికార ధ్రువీకరణ పత్రాలు, ఋణాలు మీకు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, వివాహం కాని వారికి వివాహప్రాప్తి, పునర్వివాహా ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలం. నూనె, లోహ వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని ముద్రవేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు అందరి మనిషిలా ఆమోదింపబడతారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టుతీర్పులు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతలు మీ సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణా లోపం ఉండదు. ఆస్తి వ్యవహారాలపై మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మకద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తనఖాలో ఉంచిన డాక్యుమెంట్స్‌ను, విలువైన వస్తువులను విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాను అమలుపరచడం మంచిది. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా మీకు రావలసిన బిల్స్, జీతాలు, ఏరియర్స్ సమయానికి చేతికి అందుతాయి. మీరు చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలకు ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి.క్రీడారంగంలోని వారికి ప్రఖ్యాతి లభిస్తుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను బయటకి వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్త వహించండి. ఋణాలు ఇవ్వడం, తీసుకోవడం తగ్గించండి. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. రెండువర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు మీకు లాభిస్తాయి. మీకు సంబంధంలేని విషయాలలో ఇతరులకు సహాయం చేయడం కోసం కోర్టులను, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించవలసి వస్తుంది. ఇరుగు పొరుగులతో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వచ్చిన కొత్త అవకాశాన్ని ఉపయోగించుకోవాలా లేదా అన్న సందేహంలో పడతారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకి గురిచేస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు ఉపయోగపడతాయి. విశ్రాంతిని, సౌకర్యాలను పక్కనపెట్టి విశేషంగా కృషి చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. విడిపోయిన రెండు కుటుంబాలను కలుపుతారు. బంధువులతో, దాయాదులతో వివాదాలు సంభవిస్తాయి. మీరు చెప్పిన వాస్తవాలను ఎవరూ నమ్మరు. ఇతరులు మీపై మోపిన ఆరోపణలు, నిందలు బహుళ ప్రచారంలో ఉంటాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టి సారించి లాభాలు గడిస్తారు. మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయపన్నుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వైద్య, న్యాయవాద వృత్తులలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. నిర్మాణ సంబంధమైన పనులలో లోపాలు ఏర్పడతాయి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. విదేశాలలో ఉన్నవారు గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలలో చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీ బంధువర్గంలోని ఒకరితో బంధుత్వం కలుపుకోవడానికి మీరుచేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఓర్పు, సహనం లేని వ్యక్తుల వల్ల, దురుసుగా ప్రవర్తించే మీ అంతరంగిక వర్గం వల్ల చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు. గతంలో వలె మెతకవైఖరి అవలంబించరు. విభేదాలను మనసులో దాచుకుని మీ ఇబ్బందులకు కారణమైన వ్యక్తులకు సరైన గుణపాఠం నేర్పుతారు. చట్టబద్ధంగా అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందుతారు. స్త్రీల సహాయ సహకారాలు లాభిస్తాయి. ఉద్యోగం కోసం రాసే పరీక్షలలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సాఫ్ట్వేర్ రంగుంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. కార్యాలయంలో మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసేవారికి బదిలీ ఏర్పడుతుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరాధారమైన మాటలు విని వాటి ఆధారంగా మిమ్మల్ని అభిమానించే సన్నిహితులను ఎట్టి పరిస్థితులలోనూ దూరం చేసుకోకండి. విద్య, సాంస్కృతిక విషయాలు బాగుంటాయి. కళారంగంలో గుర్తింపు లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తిని కొన్ని కారణాల వల్ల ఆహ్వానించ లేరు. ప్రేమవివాహాలు విఫలం అవుతాయి. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులకు వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లమ్స్‌ను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం ఆందోళనకు కారణం అవుతుంది. మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు అధికం అవుతారు. కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. సహోదర సహోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించినా మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి. వివాహ సంబంధమైన విషయాలలో సర్దుకుపోయే ధోరణి అవలంబిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, సాహిత్య, కళా రంగాలలో, విద్యారంగంలో ప్రఖ్యాతి సంభవం. బ్యూటీపార్లర్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. చీటీల వల్ల, ఫైనాన్స్ బిజినెస్ వల్ల నష్టపోతారు. మీకు ఇబ్బంది కలిగించేవారి కార్యకలాపాలు ఎక్కువ కాలం కొనసాగవు. చాలా విషయాలలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మీరు నమ్మిన వాళ్ళు మీ మాట వినరు. మీ పట్టుదల వల్ల అయినవాళ్ళతో బంధుత్వం ఏర్పడుతుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికం కావడం చికాకు తెప్పిస్తుంది. బంధువులలో డాంబికంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మీ అంతరంగిక విషయాలను బంధువులతో పంచుకోరు. చిన్నదానికీ, పెద్దదానికీ అబద్ధాలు చెప్పడం అనివార్యం అవుతుంది. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఋణ బాధల నుండి విముక్తి పొందుతారు. ఎంత చెప్పినా మారని వ్యక్తులను మార్చడానికి పట్టువీడని విక్రమార్కుడిలా శ్రమిస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, చేతివృత్తి పనులు లాభిస్తాయి. ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది. -
ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువ
ఆస్ట్రోఫన్డా రాశులలో కన్యరాశి ఆరోది. ఇది సరి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో పొట్ట, నడుము, నరాలను ఈ రాశి సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీరాశి, దిశ దక్షిణం. ఇందులో ఉత్తరా ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నాలుగు పాదాలూ, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. నివాస స్థానం కేరళ ప్రాంతం. ఇది భారత్, బ్రెజిల్, టర్కీ పరిసర ప్రాంతాలను సూచిస్తుంది. పెసలు, బఠాణీలు, ఆముదం, పత్తి మొదలైన ద్రవ్యాలపై ప్రభావం కలిగి ఉంటుంది. కన్యరాశి వారు మృదు స్వభావులు, కాస్త సిగ్గరులు, మొహమాటస్తులు. శ్రద్ధగా తమ పని తాము చేసుకుపోవడంలో తేనెటీగలను తలపిస్తారు. అడిగినదే తడవుగా ఇతరులకు సాయం చేయడంలోనే ఆనందం వెదుక్కుంటారు. తమ మితిమీరిన పరోపకార ధోరణి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, తమదైన ధోరణిలోనే జీవిస్తారు. ప్రణాళికాబద్ధంగా, పూర్తి అంకిత భావంతో కష్టించి పనిచేయడంలో వీరికి సాటివచ్చే వారు అరుదు. ఎంత ఒత్తిడి ఎదురైనా సహనం కోల్పోకుండా ఉండటం వీరి ప్రత్యేకత. మొహమాటం వల్ల తమంతట తామే చొరవ తీసుకుని ఇతరులతో కలుపుగోలుగా ఉండలేరు. ఈ లక్షణం వల్ల తరచు అపార్థాలకు గురవుతారు. అయితే, ఇతరులు చొరవ తీసుకుని, వీరితో స్నేహం చేస్తే మాత్రం వారి పట్ల నమ్మకంగా ఉంటారు. వీరికి క్షమాగుణం కూడా ఎక్కువే. ఇతరులు తమ పట్ల చేసిన చిన్న చిన్న తప్పులను తేలికగా క్షమిస్తారు. చురుకైన మేధాశక్తి వీరి సొంతం. పనిభారం ఎంత ఉన్నా తొందరగా అలసిపోరు. బయటకు నిరాడంబరంగా కనిపించినా, వీరికి విలాసాలపై కూడా మక్కువ ఉంటుంది. తమ కష్టానికి ఆశించిన ఫలితం దక్కకుంటే తొందరగా నిర్వేదానికి లోనవుతారు. మానసికంగా గాయపడినప్పుడు ఇతరులను ఏమీ అనలేక ఆత్మనిందకు పాల్పడతారు. తాము ఉండే చోట అన్నీ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. వీరి ధోరణి ఒక్కోసారి సన్నిహితులకు చాదస్తంగా అనిపిస్తుంది. సృజనాత్మకతకు ఆస్కారం ఉండే రచన, నటన, సంగీత, నృత్య కళా రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. అకౌంటింగ్, బ్యాంకింగ్, వైద్యం, సామాజిక సేవ, విదేశీ వ్యవహారాలు వంటి రంగాల్లోనూ తమ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యవసాయం, పండ్లతోటల పెంపకం, పశుపోషణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. బయటకు ఏదీ చెప్పుకోకుండా లోలోనే కుమిలిపోయే తత్వం వల్ల మానసిక సమస్యలతో, నాడీ సమస్యలతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు -
చంద్రబింబం: మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికరంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులలో ఆటంకాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త పనులకు శ్రీకారం. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. రుణయత్నాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యం. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో విందువినోదాలు. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. -
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది.