చంద్రబింబం డిసెంబర్ 22 నుండి 28 వరకు | zoiac signs from dec-22 to dec 28 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం డిసెంబర్ 22 నుండి 28 వరకు

Published Sun, Dec 22 2013 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

చంద్రబింబం డిసెంబర్ 22 నుండి 28 వరకు

చంద్రబింబం డిసెంబర్ 22 నుండి 28 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. పరపతి పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. సంఘంలో ఎనలేని గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో అకారణ వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రగతి. వాహనయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల వాతావరణం.  వారం మధ్యలో ఆస్తి వివాదాలు. పనుల్లో ఆటంకాలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు సన్మానయోగం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. పనుల్లో ఆటంకాలు.
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 అవసరాలకు సొమ్ము అందుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటువద్దు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆస్తి విషయాలలో సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు ఊహించని పురస్కారాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పనుల్లో విజయం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో  వ్యయప్రయాసలు.
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 కార్యక్రమాలు ప్రథమార్థంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. చర, స్థిరాస్తులను సమకూర్చు కుంటారు. విజయాల బాటలో నడుస్తారు. ప్రత్యర్థులు సైతం తోడుగా నిలుస్తారు. అవకాశాలు దగ్గరకు వస్తాయి. ద్వితీయార్థంలో మరింత అనుకూలత.
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 సల్మాన్‌ఖాన్
 పుట్టినరోజు: డిసెంబర్ 27
 
 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement