చంద్రబింబం : డిసెంబర్ 15 నుండి21 వరకు | zodiac signs : dec 15- 21 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం : డిసెంబర్ 15 నుండి21 వరకు

Published Sun, Dec 15 2013 2:28 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

చంద్రబింబం : డిసెంబర్ 15 నుండి21 వరకు - Sakshi

చంద్రబింబం : డిసెంబర్ 15 నుండి21 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలు. ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు విధులు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినీయవు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు.ధనవ్యయం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సోదరులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు సర్దుబాటు వైఖరితో సాగడం మంచిది.  వారం ప్రారంభంలో వాహనయోగం. వస్తులాభాలు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. విభేదాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 వివాదాలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వారం ప్రారంభంలో చికాకులు. అనారోగ్యం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు మార్పులు జరిగే అవకాశం. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 రావలసిన సొమ్ము ఆలస్యమై ఇబ్బంది పడతారు. ఇంటా బయటా ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. వారం ప్రారంభంలో విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సైతం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 నూతన పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు. మీ కార్యదక్షత నిరూపించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వారం ప్రారంభ ంలో దూరప్రయాణాలు. రుణఒత్తిడులు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. రుణాలు చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకోవలసిన సమయం. విద్యార్థులకు అసంతృప్తి. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. శుభవార్తలు.
 
 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. రాబడికి లోటు ఉండదు. సంఘంలో విశేష ఆదరణ. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వచ్చే జూన్ తరువాత ఆరోగ్య విషయంలో కొంత మెలకువ పాటించాలి.
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 తమన్నా
 పుట్టినరోజు: డిసెంబర్21
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement