బిస్కెట్ల కోసం చేయి పెట్టి...
మెల్ బోర్న్: ఎదురుగా బిస్కెట్లు ఊరిస్తుంటే ఆబగా అందుకుందామని వెండింగ్ మెషీన్ లో చేయి పెట్టిన ఆసీస్ చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు. ఆరు గంటల తర్వాత ప్రమాదం నుంచి బయటపెట్టాడు.
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఈ ఘటన చేసుకుంది. నాలుగేళ్ల లియో బిస్కెట్ల కోసం వెండింగ్ మిషన్ లో చేయి పెట్టాడు. బిస్కెట్లు తీసుకునేలోపు అతడి చేయి మిషన్ లో ఇరుక్కుపోయింది. దీంతో లియో బాధతో విలవిల్లాడు. పెద్దగా కేకలు పెట్టాడు. సమాచారం అందుకున్న మెల్ బోర్న్ అగ్నిమాపక సిబ్బంది లొన్స్ డేల్ స్ట్రీట్ లోని మిషన్ వద్దకు చేరుకున్నారు. 6 గంటల పాటు శ్రమించి చిన్నారికి విముక్తి కల్పించారు.
తన కుమారుడు వెండింగ్ మిషన్ ను చూడడం ఇదే మొదటిసారని లియో తండ్రి ఆరోన్ షర్తోవుస్ తెలిపారు. బిస్కట్లు, ఇతర తినుబండారాలు మిషన్ లో కనపడడంతో అందులో చేయి పెట్టి ఉంటాడని పేర్కొన్నారు. లియో పెట్టిన కేకలు వీధంతా వినిపించాయని ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు. లియో సురక్షితంగా ఉన్నప్పటికీ ముందుజాగ్రత్త కోసం అతడిని రాయల్ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారని స్థానిక మీడియా తెలిపింది.