ఈసారీ సెంచరీ చేస్తా: రోజర్స్ | Rogers wants to score century on Boxing Day | Sakshi
Sakshi News home page

ఈసారీ సెంచరీ చేస్తా: రోజర్స్

Published Wed, Dec 24 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

ఈసారీ సెంచరీ చేస్తా: రోజర్స్

ఈసారీ సెంచరీ చేస్తా: రోజర్స్

 మెల్‌బోర్న్: ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ క్రిస్ రోజర్స్ అదే జోరును మెల్‌బోర్న్‌లో ఈనెల 26న మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఈ టెస్టులో సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీలు చేసిన 37 ఏళ్ల ఈ వెటరన్ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడతానని చెబుతున్నాడు.
 
  ‘నేనిక్కడ రెండోసారి బాక్సింగ్ డే టెస్టు ఆడబోతున్నాను. గతేడాది సెంచరీ చేసినట్టే ఈసారి కూడా అదే రీతిన ఆడాలనుకుంటున్నాను’ అని అన్నాడు. 2013లో ఎంసీజీలోనే ఇంగ్లండ్‌పై సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement