boxing day
-
ఆసీస్ జట్టులో ఏడేళ్ల కుర్రాడు!
మెల్బోర్న్: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బాక్సింగ్ డే’ టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో 7 ఏళ్ల చిన్నారిని ఎంపిక చేసింది. 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు కల్పించడంతో పాటు కో–కెప్టెన్‌గా కూడా నియమించింది. హృద్రోగంతో బాధపడుతున్న ఆర్కీ షిల్లర్ అనే చిన్నారి కోరిక తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది. గుండె నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న అతనికి ఏడో పుట్టిన రోజు సందర్భంగా ‘మేక్ ఏ విష్’ ఆస్ట్రేలియా ఫౌండేషన్ ద్వారా మరపురాని బహుమతినిచ్చింది. ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎదగాలని కలలు కన్న ఆ చిన్నారి ఆశలను ఈ రకంగా పూర్తి చేసింది. ఆదివారం ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో కూడా ఆర్కీ పాల్గొనడం విశేషం. -
బాక్సింగ్ డే
ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనను చూడడానికి ముగ్గురు విజ్ఞానులు బెథెల్హామ్కి వెళ్లారు. భగవం తుడిని చూడటానికి ఉత్త చేతులతో వెళ్లకూడదని ముగ్గురూ మూడు వస్తువులను తీసికొని వెళ్లారు. అం దులో ఒకటి బంగారు పాత్ర, సాంబ్రాణి కొమ్మ, బోలెం బెరడు. ఆనాటి ఆచారాన్ని అనుసరిస్తూ ఇప్పటికీ కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. డిసెంబర్ 25న కానుకల బాక్స్‌లు విప్పి చూసే తీరిక ఉండదు కనుక మరుసటి రోజు ఆ బాక్స్‌లను తెరిచిచూస్తారు. కనుక డిసెంబర్ 26ను ‘బాక్సింగ్ డే’గా పరిగణిస్తున్నారు. ఈ దినం గురించి పలు అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వపు బ్రిటిష్ వలస దేశాల్లో ‘బాక్సింగ్ డే’ పేరుతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరికొన్ని దేశాల్లో ‘సెయింట్ స్టీఫెన్స్ డే’గా జరుపుకుంటారు. ఇంగ్లండ్, ఐర్లండ్, ఇటలీ మొదలైన అనేక దేశాల్లో బాక్సింగ్ డేని సెలవుదినంగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ‘ప్రొక్లమేషన్ డే’ పేరుతో ఈ దినోత్స వాన్ని జరుపుకుంటారు. (నేడు ‘బాక్సింగ్ డే’ సందర్భంగా) కామిడి సతీష్ రెడ్డి, పరకాల -
26న లోకాయుక్తకు సెలవు
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల సెలవుదినాలను ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 26న బాక్సింగ్ డేను తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త సంస్థకు సెలవుదినం ప్రకటించారు. మొదట దీన్ని ఐచ్ఛిక సెలవుగా పరిగణించారు. ఆ తర్వాత సాధారణ సెలవుగా మార్చారు. -
ఈసారీ సెంచరీ చేస్తా: రోజర్స్
మెల్బోర్న్: ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ క్రిస్ రోజర్స్ అదే జోరును మెల్బోర్న్లో ఈనెల 26న మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొనసాగించాలని అనుకుంటున్నాడు. ఈ టెస్టులో సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీలు చేసిన 37 ఏళ్ల ఈ వెటరన్ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడతానని చెబుతున్నాడు. ‘నేనిక్కడ రెండోసారి బాక్సింగ్ డే టెస్టు ఆడబోతున్నాను. గతేడాది సెంచరీ చేసినట్టే ఈసారి కూడా అదే రీతిన ఆడాలనుకుంటున్నాను’ అని అన్నాడు. 2013లో ఎంసీజీలోనే ఇంగ్లండ్‌పై సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
మార్ష్ స్థానంలో బర్న్స్
‘బాక్సింగ్ డే’ టెస్టుకు ఆసీస్ జట్టు బ్రిస్బేన్: ఊహించని విధంగా క్వీన్స్లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. భారత్‌తో జరగబోయే మూడో టెస్టు (బాక్సింగ్ డే) కోసం ఎంపిక చేసిన 13 మందిలో అతనికి స్థానం కల్పించారు. గాయపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో జో బర్న్స్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బర్న్స్ 55 సగటుతో 439 పరుగులు చేయడం అతనికి కలిసొచ్చింది. ఈ క్వీన్స్‌లాండర్ ఫస్ట్‌క్లాస్ స్థాయిలో 42.54 సగటుతో 2978 పరుగులు సాధించాడు. క్రిస్మస్ పండుగ వేళ తనకు ఊహించని అవకాశం దక్కిందని బర్న్స్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు వివరాలు: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రోజర్స్, వాట్సన్, షాన్ మార్ష్, జో బర్న్స్, హాడిన్, జాన్సన్, స్టార్క్, లయోన్, హాజల్‌వుడ్, హారిస్, సిడిల్.