ఏసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనను చూడడానికి ముగ్గురు విజ్ఞానులు బెథెల్‌హామ్‌కి వెళ్లారు. భగవం తుడిని చూడటానికి ఉత్త చేతులతో వెళ్లకూడదని ముగ్గురూ మూడు వస్తువులను తీసికొని వెళ్లారు. అం దులో ఒకటి బంగారు పాత్ర, సాంబ్రాణి కొమ్మ, బోలెం బెరడు. ఆనాటి ఆచారాన్ని అనుసరిస్తూ ఇప్పటికీ కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. డిసెంబర్ 25న కానుకల బాక్స్‌లు విప్పి చూసే తీరిక ఉండదు కనుక మరుసటి రోజు ఆ బాక్స్‌లను తెరిచిచూస్తారు.
కనుక డిసెంబర్ 26ను ‘బాక్సింగ్ డే’గా పరిగణిస్తున్నారు. ఈ దినం గురించి పలు అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వపు బ్రిటిష్ వలస దేశాల్లో ‘బాక్సింగ్ డే’ పేరుతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరికొన్ని దేశాల్లో ‘సెయింట్ స్టీఫెన్స్ డే’గా జరుపుకుంటారు. ఇంగ్లండ్, ఐర్లండ్, ఇటలీ మొదలైన అనేక దేశాల్లో బాక్సింగ్ డేని సెలవుదినంగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియాలో ‘ప్రొక్లమేషన్ డే’ పేరుతో ఈ దినోత్స వాన్ని జరుపుకుంటారు.
(నేడు ‘బాక్సింగ్ డే’ సందర్భంగా)
కామిడి సతీష్ రెడ్డి, పరకాల
బాక్సింగ్ డే
Published Sat, Dec 26 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM
Advertisement