మెల్‌బోర్న్: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బాక్సింగ్ డే’ టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో 7 ఏళ్ల చిన్నారిని ఎంపిక చేసింది. 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు కల్పించడంతో పాటు కో–కెప్టెన్‌గా కూడా నియమించింది. హృద్రోగంతో బాధపడుతున్న ఆర్కీ షిల్లర్ అనే చిన్నారి కోరిక తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది. గుండె నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న అతనికి ఏడో పుట్టిన రోజు సందర్భంగా ‘మేక్ ఏ విష్’ ఆస్ట్రేలియా ఫౌండేషన్ ద్వారా మరపురాని బహుమతినిచ్చింది. ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎదగాలని కలలు కన్న ఆ చిన్నారి ఆశలను ఈ రకంగా పూర్తి చేసింది. ఆదివారం ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ఆర్కీ పాల్గొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment