మృత్యువుతో పోరాడి ఓడాడు
మెల్బోర్న్: ఓ భారతీయ విద్యార్థి దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.... శుక్రవారం మరణించాడు. ఈ సంఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకుంది. భారత్కు చెందిన బుద్దేశ్ పళని (26) న్యూజిలాండ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. పళని సోమవారం సముద్రంలో విహారానికి వెళ్లాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మునిగిపోయాడు. అదే సమయంలో సముద్రంలో విహరిస్తున్న నలుగురు యువతియువకులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
అతడు వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం మరణించాడు. అయితే ఆసుపత్రిలో ఆపస్మారక స్థితిలో ఉన్న పళనిని ఎవరు గుర్తించలేదు. పళని ఫోటోలతో స్థానిక మీడియాలు పలు వార్తా కథనాలు ప్రసారం చేసింది. కథనాల్లో ప్రసారం అయ్యేది పళని అని అతడి స్నేహితులు గుర్తించి... వెల్డింగ్టన్ ఆసుపత్రికి చేరుకున్నారు. పళని ప్రమాదం వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.