ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ విజేత ఫెడరర్‌  | Roger Federer beats Marin Cilic for 20th Grand Slam trophy | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ విజేత ఫెడరర్‌ 

Published Sun, Jan 28 2018 6:17 PM | Last Updated on Sun, Jan 28 2018 7:16 PM

Roger Federer beats Marin Cilic for 20th Grand Slam trophy - Sakshi

రోజర్‌ ఫెడరర్‌

మెల్‌బోర్న్‌: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన ఆరోసీడ్‌ మారిన్‌ సిలిచ్‌పై 6-2, 6-7(5/7), 6-3, 3-6, 6-1తో గెలిపొందాడు. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరరే పైచేయి సాధించాడు.

ఈ విజయంతో కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌  టైటిల్‌ గెలుచుకున్నాడు. ఇక 30వ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌ ఆడిన ఫెడరర్‌ 6 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు గెలుచుకొని నోవాక్‌ జొకోవిక్‌, ఆస్ట్రేలియన్‌ గ్రేటర్‌ రాయ్‌ ఎమెర్సన్ల సరసన అగ్రస్థానంలో నిలిచాడు. సెమీఫైనల్లో ఫెడరర్‌ దక్షిణకొరియా ప్లేయర్‌ చుంగ్‌యాన్‌పై గెలిచి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement