మెల్‌బోర్న్ : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మెల్‌బోర్న్ హోటల్ రూంలో బుధవారం సాయంత్రం టీమిండియా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది. ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన రోహిత్ కఠిన క్వారంటైన్ నిబంధనలను పాటించాడు. తాజాగా బుధవారం సాయంత్రం మెల్‌బోర్న్‌లోని హోటల్ రూలంలో ఉన్న టీమిండియా జట్టును కలిశాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా తదితర ఆటగాళ్లు రోహిత్‌కు ఘనస్వాగతం పలికారు. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రోహిత్‌తో కాసేపు ముచ్చటించాడు.(చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్)
అయితే టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి రోహిత్‌తో అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాయ్ రోహిత్.. 14రోజుల క్వారంటైన్ ఎలా ఉంది.. క్వారంటైన్ తర్వాత చాలా యంగ్‌గా కనిపిస్తున్నావు అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ ఆడే అవకాశాలున్నాయి. కాగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
మరోవైపు తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని... క్వారంటైన్ తర్వాత రోహిత్ శర్మ మానసిక స్థితి, మ్యాచ్ ఫిట్‌నెస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్ అగర్వాల్ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి : రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి)
Look who's joined the squad in Melbourne 😀
— BCCI (@BCCI) December 30, 2020
A warm welcome for @ImRo45 as he joins the team 🤗#TeamIndia #AUSvIND pic.twitter.com/uw49uPkDvR
Comments
Please login to add a commentAdd a comment