
మెల్‌బోర్న్ : వైస్సార్ సీపీ కన్వీనర్ కౌశిక్ రెడ్డి మామిడి ఆధ్వర్యంలో మెలోబోర్న్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా కేకు కట్ చేసి ప్రత్యేకంగా రూపోందించిన వైఎస్సార్ ఏవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలోయూత్ ప్రెసిడెంట్ లోకేష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రమ్య యార్లగడ్డ, రాజేష్ శాఖమురి మరియు వైస్సార్ సీపీ అడిలైడ్ నుంచి సతీష్ రెడ్డి కొండ పాల్గొన్నారు. లిబరల్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు రాంపాల్ రెడ్డి, ఏటీఏఐ అధ్యక్షుడు అమరేందర్ అత్తపురం, ఆస్ట్రేలియా బీజేపీ నాయకులు శ్రీపాల్ రెడ్డి , ఆస్ట్రేలియా మూవీ యాక్టర్ మురళి పరిశే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment