ట్రోఫీలతో జొకోవిచ్, సిట్సిపాస్ (PC: Australia Open)
గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జొకోవిచ్ మెల్‌బోర్న్‌కు వచ్చాడు. కానీ కోవిడ్ టీకా వేసుకోనందుకు... అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఒక్కడి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేసింది. విమానాశ్రయంలోనే అతడిని నిర్భంధించింది.
జొకోవిచ్ వీసాను రద్దు చేసింది. మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. న్యాయపోరాటం చేసినా ఈ సెర్బియా స్టార్‌కు అనుకూల నిర్ణయం రాలేదు. దాంతో అవమానకర రీతిలో జొకోవిచ్ విమానాశ్రయం నుంచే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఏడాది గడిచిపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వం కూడా మారిపోయింది. జొకోవిచ్ వీసాను పునరుద్ధరించడం జరిగింది. వెరసి తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ పదోసారి విజయగర్జన చేశాడు.
మెల్‌బోర్న్: ఫ్రెంచ్ ఓపెన్ అంటే రాఫెల్ నాదల్... వింబుల్డన్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొస్తారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరూపించాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు.
ప్రైజ్‌మనీ ఎంతంటే
ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 16,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.
సిట్సిపాస్‌కిది రెండోసారి
సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి
అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్‌ను కూడా కోల్పోయాడు.
ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్‌కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు.
ఫైనల్ గణాంకాలు
జొకోవిచ్ వర్సెస్ సిట్సిపాస్
7 | ఏస్‌లు | 15 |
3 | డబుల్ ఫాల్ట్‌లు | 3 |
36 | విన్నర్స్ | 40 |
22 | అనవసర తప్పిదాలు | 42 |
2 | బ్రేక్ పాయింట్లు | 1 |
10 | నెట్ పాయింట్లు | 12 |
112 |
మొత్తం పాయింట్లు | 94 |
చదవండి: Shafali Verma: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా!
ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు
🤯🤯🤯@Infosys • #FindYourNext • #AusOpen • #AO2023 Tsitsipas v Djokovic • Infosys AI Shot of the Day@wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/HlwybwoeWT
— #AusOpen (@AustralianOpen) January 29, 2023
Unstoppable 🏆#luzhoulaojiao • @guojiao_1573 • #AusOpen • #AO2023 @wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/tjwd8QVSJ0
— #AusOpen (@AustralianOpen) January 29, 2023
Comments
Please login to add a commentAdd a comment