![Wimbledon Offers Record Prize Money For Championships 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/15/wimbledon.jpg.webp?itok=zbQ0N_7X)
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2023 ప్రైజ్‌మనీ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. జూలై 3 నుంచి 16 వరకు జరిగే ఈ టోరీ్నలో ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 24 కోట్ల 43 లక్షలు) చొప్పున లభిస్తాయి.
గత ఏడాది సింగిల్స్ విజేతలకు 20 లక్షల పౌండ్లు చొప్పున అందజేశారు. ఈసారి 3 లక్షల 50 వేల పౌండ్లు ఎక్కువగా ఇవ్వనున్నారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ఓడిన క్రీడాకారులకు 55 వేల పౌండ్లు (రూ. 57 లక్షల 18 వేలు) దక్కుతాయి. క్వాలిఫయింగ్‌లో తొలి రౌండ్‌లో ఓడితే 12 వేల 750 పౌండ్లు (రూ. 13 లక్షల 25 వేలు), రెండో రౌండ్‌లో ఓడితే 21 వేల 750 పౌండ్లు (రూ. 22 లక్షల 61 వేలు), మూడో రౌండ్‌లో ఓడితే 36 వేల పౌండ్లు (రూ. 37 లక్షల 42 వేలు) లభిస్తాయి.
మరికొద్ది రోజుల్లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంభం కానుంది. జూలై 3 నుంచి 16 వరకు జరగనున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్‌లో రిబాకినా (కజకిస్తాన్) డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు.
చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!
Comments
Please login to add a commentAdd a comment