Elena Rybakina
-
సబలెంకాకు చుక్కెదురు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవా 2 గంటల 29 నిమిషాల పోరులో 6–7 (5/7), 6–4, 6–4తో సబలెంకాను బోల్తా కొట్టించగా... ఇటలీకి చెందిన 12వ సీడ్ జాస్మిన్ పావ్లిని 2 గంటల 3 నిమిషాల్లో 6–2, 4–6, 6–4తో రిబాకినాను ఓడించింది. ఆండ్రీవా, జాస్మిన్ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 5–7, 6–1తో సాండర్ గిలె–జొరాన్ వ్లీగెన్ (బెల్జియం) జంటను ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/3), 6–4తో తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచి రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
French Open 2024: క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సబలెంకా 6–2, 6–3తో ఎమా నవారో (అమెరికా)పై, రిబాకినా 6–4, 6–3తో స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందారు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జాస్మిన్ పావోలిని (ఇటలీ) 4–6, 6–0, 6–1తో ఎలీనా అవానెస్యాన్ (రష్యా)పై, మిరా ఆంద్రీవా 7–5, 6–2తో వర్వారా గ్రచెవా (ఫ్రాన్స్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మెద్వెదెవ్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 4–6, 6–2, 6–1, 6–3తో మెద్వెదెవ్‌ను ఓడించి ఎనిమిదో ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
ఫేవరెట్‌గా జొకోవిచ్
లండన్: అల్కరాజ్ ప్రపంచ నంబర్‌వన్ అయినా... ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో అందరి కళ్లూ జొకోవిచ్‌పైనే ఉన్నాయి. ఈ సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ‘హ్యాట్రిక్’తో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో టైటిల్ చేజిక్కించుకుంటాడనే అంచనాలు పెరిగాయి. మరోవైపు స్పెయిన్ సంచలనం అల్కరాజ్ కూడా టాప్ ర్యాంకు ఉత్సాహంతో వింబుల్డన్ వేటకు సిద్ధమమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఎలీనా రిబాకినా కూడా వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సమరానికి సై అంటోంది. సోమవారం నుంచి వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే సీడింగ్స్, డ్రా విడుదల చేయగా... ఇప్పుడు కోర్టులో టైటిల్ వేటే మిగిలింది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుతో ఉన్న జొకోవిచ్ ఇప్పుడు 24వ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. రెండో సీడ్ సెర్బియన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో పెడ్రొ కచిన్ (అర్జెంటీనా)తో తలపడతాడు. టాప్‌సీడ్ కార్లొస్ అల్కరాజ్... జెరెమి చార్డి (ఫ్రాన్స్)తో జరిగే మొదటి రౌండ్ పోరుతో వింబుల్డన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు. మహిళల సింగిల్స్‌లో రిబాకినా వరుసగా రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. గతేడాది ఈ 24 ఏళ్ల కజకిస్తాన్ స్టార్ వింబుల్డన్ ట్రోఫీతో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను తృటిలో కోల్పోయింది. ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆమె రన్నరప్‌గా తృప్తిపడింది. టైటిల్ నిలబెట్టుకునేందుకు తొలి రౌండ్లో అమెరికన్ రోజర్స్‌తో ఆమె తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)... జు లిన్ (చైనా)తో గ్రాండ్‌స్లామ్ ఆటను మొదలుపెట్టనుంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అమెరికన్ వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినాతో పోటీ పడుతుంది. -
జూలై 3 నుంచి వింబుల్డన్.. ప్రైజ్‌మనీ భారీగా పెంపు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2023 ప్రైజ్‌మనీ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. జూలై 3 నుంచి 16 వరకు జరిగే ఈ టోరీ్నలో ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 24 కోట్ల 43 లక్షలు) చొప్పున లభిస్తాయి. గత ఏడాది సింగిల్స్ విజేతలకు 20 లక్షల పౌండ్లు చొప్పున అందజేశారు. ఈసారి 3 లక్షల 50 వేల పౌండ్లు ఎక్కువగా ఇవ్వనున్నారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఓడిన క్రీడాకారులకు 55 వేల పౌండ్లు (రూ. 57 లక్షల 18 వేలు) దక్కుతాయి. క్వాలిఫయింగ్‌లో తొలి రౌండ్లో ఓడితే 12 వేల 750 పౌండ్లు (రూ. 13 లక్షల 25 వేలు), రెండో రౌండ్లో ఓడితే 21 వేల 750 పౌండ్లు (రూ. 22 లక్షల 61 వేలు), మూడో రౌండ్లో ఓడితే 36 వేల పౌండ్లు (రూ. 37 లక్షల 42 వేలు) లభిస్తాయి. మరికొద్ది రోజుల్లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంభం కానుంది. జూలై 3 నుంచి 16 వరకు జరగనున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్‌లో రిబాకినా (కజకిస్తాన్) డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
French Open 2023: ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా ఫిట్నెస్ సమస్యలతో వైదొలగగా, ఆరోసీడ్ కోకో గాఫ్, 14వ సీడ్ హదాడ్ మైయాతో పాటు పురుషుల ఈవెంట్లో సీడెడ్లు కాస్పెర్ రూడ్, హోల్గెర్ రూన్ (డెన్మార్క్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. జపనీస్ స్టార్ నిషిఒకా చెమటోడ్చి ముందంజ వేయగా, 15వ సీడ్ బొర్నా కొరిచ్ మూడో రౌండ్లో నిష్క్రమించాడు. ఏకపక్షంగా... మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు (2020, 2022) ఇక్కడ క్లే కోర్ట్ చాంపియన్‌గా నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్‌కు మూడో రౌండ్లో చైనీస్ ప్రత్యర్థి నుంచి కనీస పోటీనే లేకపోయింది. దీంతో పోలండ్ స్టార్ 6–0, 6–0తో జిన్యూ వాంగ్‌ను అతి సునాయాసంగా ఓడించింది. కేవలం 51 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ ఎలీనా రిబాకినా మ్యాచ్ బరిలోకి దిగకుండా టోర్నీ నుంచి తప్పుకుంది. అనారోగ్య కారణాలతో మూడో రౌండ్ బరిలోకి దిగలేనని 23 ఏళ్ల కజకిస్తాన్ ప్లేయర్ వెల్లడించింది. దీంతో ప్రత్యర్థి సార సొరిబెస్ టొర్మో (స్పెయిన్) వాకోవర్‌తో ప్రిక్వార్టర్స్ చేరింది. మిగతా మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (5/7), 6–1, 6–1తో మిర అండ్రీవా (రష్యా)పై గెలుపొందగా, 14వ సీడ్ హదాడ్ మైయా 5–7, 6–4, 7–5తో అలెగ్జాండ్రొవా (రష్యా)ను ఓడించింది. పోరాడి ఓడిన సెబొత్ బ్రెజిలియన్ క్వాలిఫయర్ తియాగో సెబొత్ వైల్డ్ అంటే ఇకపై ప్రత్యర్థులు హడలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఇదివరకే అతను తొలి రౌండ్లోనే యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ (2021), రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. తాజాగా అతని దూకుడుకు జపాన్ నంబర్‌వన్ ఆటగాడు యొషిహితో నిషిఒకా బ్రేకులేసినప్పటికీ సెబొత్ తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. 27వ సీడ్ నిషిఒకా 3–6, 7–6 (10/8), 2–6, 6–4, 6–0తో సెబొత్ వైల్డ్‌పై శ్రమించి గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4–6, 6–4, 6–1, 6–4తో చైనాకు చెందిన జాంగ్ జిజెన్పై గెలుపొందాడు. నార్వే స్టార్‌కు తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనా... తర్వాత సెట్లలో సులువుగానే గెలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్ చేరిన ఆరోసీడ్ డెన్మార్క్ స్టార్ రూన్ ఇప్పుడు మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఆడుతున్నాడు. మూడో రౌండ్లో తనకెదురైన ప్రత్యర్థి ఒలీవియెరి (అర్జెంటీనా)ను 6–4, 6–1, 6–3తో ఓడించాడు. కేవలం రెండు గంటల్లోనే (గంటా 58 నిమిషాలు) మ్యాచ్‌ను ముగించాడు. బొర్న కొరిచ్ (క్రొయే షియా) 3–6, 6–7(5/7), 2–6తో మార్టిన్ ఎచెవెరి (అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
AUS Open 2023: మహిళల సింగిల్స్ విజేత సబలెంకా
ఒకరు 195 కిలోమీటర్ల వేగంతో సర్వీస్ చేస్తున్నారు.... మరొకరు ఏమాత్రం తగ్గకుండా 192 కిలోమీటర్ల వేగంతో జవాబిస్తున్నారు... ప్రతీ పాయింట్ కోసం హోరాహోరీ సమరం... వీరి షాట్లతో బంతి పగిలిపోతుందేమో అనిపించింది... ఒకరు ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ చాంపియన్ కాగా, మరొకరు తొలి టైటిల్ వేటలో పోరాడుతున్నారు...దూకుడు ఎలా ఉందంటే తొలి 13 పాయింట్లలో 7 ఏస్‌ల ద్వారానే వచ్చాయి... చివరి వరకు కూడా అదే ధాటి కొనసాగింది... గత కొన్నేళ్లుగా ఏకపక్షంగా జరుగుతున్న మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్‌లతో పోలిస్తే పోటీపోటీగా, అత్యుత్తమ స్థాయిలో ఈ తుది పోరు సాగింది. చివరకు 2 గంటల 28 నిమిషాల ఆట తర్వాత విజేత అవతరించింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ కొత్త చాంపియన్‌గా అరైనా సబలెంకా నిలిచింది. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన 29వ క్రీడాకారిణిగా అరైనా సబలెంకా గుర్తింపు తెచ్చుకుంది. శనివారం జరిగిన తుది పోరులో సత్తా చాటిన 24 ఏళ్ల ఈ బెలారస్ స్టార్ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో 22వ సీడ్ సబలెంకా 4–6, 6–3, 6–4 స్కోరుతో ఐదో సీడ్ ఎలెనా రిబాకినా (కజకిస్తాన్)ను ఓడించింది. మ్యాచ్‌లో సబలెంకా 17 ఏస్‌లు కొట్టగా, రిబాకినా 9 ఏస్‌లు బాదింది. ప్రత్యరి్థతో పోలిస్తే 51–31 విన్నర్లతో ఆమె పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సబలెంకాకు 29 లక్షల 75 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 17.34 కోట్లు), రన్నరప్ రిబాకినాకు 16 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 9.47 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. తాజా గెలుపుతో సబలెంకా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. హోరాహోరీగా... ఫైనల్‌కు ముందు బలాబలాలు చూస్తే ఇద్దరు సమఉజ్జీలుగానే కనిపించారు. ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ గెలిచిన అనుభవంతో పాటు ఈ టోరీ్నలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ విజేతలు స్వియాటెక్, ఒస్టాపెంకో, అజరెంకాలను ఓడించిన ఘనతతో రిబాకినా బరిలోకి దిగగా, ఈ ఏడాది ఓటమి ఎరుగని రికార్డుతో సబలెంకా నిలిచింది. తొలి సెట్లో రిబాకినా ఆధిక్యం ప్రదర్శిస్తూ 3–1తో ముందంజ వేసినా, ఆపై కోలుకొని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బెలారస్ ప్లేయర్ 4–4తో స్కోరు సమం చేసింది. అయితే బ్రేక్ సాధించిన రిబాకినా ఆపై సర్వీస్ నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో తన ఫోర్‌హ్యాండ్ పదును ప్రదర్శించిన సబలెంకా 4–1 వరకు వెళ్లింది. ఆపై కజక్ ప్లేయర్ ఎదరుదాడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండు వరుస ఏస్‌లతో సబలెంకా సెట్ ముగించింది. మూడో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 3–3కు చేరింది. అయితే ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో కీలకమైన ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన సబలెంకాకు మళ్లీ వెనక్కి చూడాల్సిన అవసరం లేకపోయింది. Your #AO2023 women’s singles champion, @SabalenkaA 🙌@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen pic.twitter.com/5ggS5E7JTp — #AusOpen (@AustralianOpen) January 28, 2023 -
మాజీ నంబర్ వన్‌కు షాకిచ్చి రిబాకినా.. సునాయాసంగా సబలెంకా! ఫైనల్లో..
Elena Rybakina Vs Aryna Sabalenka In Final- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. గత ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గి వెలుగులోకి వచ్చిన కజకిస్తాన్ అమ్మాయి ఎలీనా రిబాకినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన సబలెంకా (బెలారస్) మధ్య శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ నంబర్ వన్‌కు షాకిచ్చి గురువారం జరిగిన రెండు సెమీఫైనల్స్‌లో 22వ సీడ్ రిబాకినా 7–6 (7/4), 6–3తో 2012, 2013 చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించగా... ఐదో సీడ్ సబలెంకా 7–6 (7/1), 6–2తో అన్‌సీడెడ్ మగ్దా లీనెట్ (పోలాండ్)పై విజయం సాధించింది. కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సబలెంకాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండగా... రిబాకినా కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుది పోరుకు చేరింది. ఇక అజరెంకాతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తొమ్మిది ఏస్‌లు, 30 విన్నర్స్ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు అజరెంకా మూడు ఏస్‌లు కొట్టి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేసింది. అజరెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రిబాకినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. సబలెంకా ముందు నిలవలేకపోయిన లీనెట్ తన కెరీర్లో 30వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన లీనెట్ కీలకపోరులో సబలెంకాకు సరైన సమాధానమివ్వలేకపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లీనెట్ తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా రెండో సెట్లో డీలా పడింది. మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఏకంగా 33 విన్నర్స్ కొట్టింది. సబలెంకాదే పైచేయి మూడుసార్లు లీనెట్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే చేజార్చుకుంది. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా నాలుగో ప్రయత్నంలో సఫలమై ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. రిబాకినాతో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఖచనోవ్ (రష్యా)తో సిట్సిపాస్ (గ్రీస్)... టామీ పాల్ (అమెరికా)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే...