సబలెంకాకు చుక్కెదురు | Mira Andreevas sensational win over world number two | Sakshi
Sakshi News home page

సబలెంకాకు చుక్కెదురు

Published Thu, Jun 6 2024 6:01 AM | Last Updated on Thu, Jun 6 2024 6:01 AM

Mira Andreevas sensational win over world number two

ప్రపంచ రెండో ర్యాంకర్‌పై రష్యా టీనేజర్‌ మిరా ఆండ్రీవా సంచలన విజయం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌), నాలుగో ర్యాంకర్‌ రిబాకినా (కజకిస్తాన్‌) క్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగారు. 

రష్యాకు చెందిన 17 ఏళ్ల మిరా ఆండ్రీవా 2 గంటల 29 నిమిషాల పోరులో 6–7 (5/7), 6–4, 6–4తో సబలెంకాను బోల్తా కొట్టించగా... ఇటలీకి చెందిన 12వ సీడ్‌ జాస్మిన్‌ పావ్లిని 2 గంటల 3 నిమిషాల్లో 6–2, 4–6, 6–4తో రిబాకినాను ఓడించింది. ఆండ్రీవా, జాస్మిన్‌ తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నారు.  

సెమీస్‌లో బోపన్న జోడీ 
పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 7–6 (7/3), 5–7, 6–1తో సాండర్‌ గిలె–జొరాన్‌ వ్లీగెన్‌ (బెల్జియం) జంటను ఓడించింది.

 మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ 6–3, 7–6 (7/3), 6–4తో తొమ్మిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచి రెండో ర్యాంకర్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement