తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితకు మెల్ బోర్న్ లో ఘన స్వాగతం లభించింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సోమవారం ఉదయం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ చేరుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ జాగృతి, టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ సభ్యులు విమానాశ్రయంలో కవితకు ఘనస్వాగతం పలికారు. జూలై 4వరకు ఆమె ఇక్కడ పర్యటించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొననున్నారు.