మెల్‌బోర్న్ : ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఓ వ్యక్తికి జైలుశిక్ష వేసిన ఘటన మెల్‌బోర్న్‌లో చోటుచేసుకుంది. ఇండియాకు చెందిన మన్‌ప్రీత్ సింగ్ ఫోన్‌లో చైల్డ్ పోర్నొగ్రఫీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. ఇది చట్టరిత్యా నేరమని అతడిని కష్టడీలోకి తీసుకున్నారు. అయితే ఇది నేరమని తనకు తెలియదని కోర్డు ముందు విన్నవించుకున్నాడు.
అతని వాదన విన్న కోర్టు.. ఇంతకు ముందు అతనిపై ఎలాంటి కేసులు లేనందున ఏడు నెలల జైలు శిక్షను, ఐదు వందల డాలర్లను ఫైన్‌గా వేసింది. దీంట్లో రెండు నెలలు మాత్రమే జైలు శిక్ష అని, మంచి ప్రవర్తనతో మెలిగితే.. ఆ తరువాత వెయ్యి డాలర్ల పూచీ కత్తుతో బయటకు రావచ్చని తెలిపింది. అయితే ఆ ఐదు నెలలు కోర్టు పరిధిలోనే ఉండాలని అటు తరువాతే ఇండియాకు పంపుతామని కోర్టు తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment