సంగారెడ్డి జోన్ : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ కార్యక్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందిని గురువారం సంగారెడ్డి జిల్లా ఏడీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక రోజు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్ష విధిస్తూ ఏడీఎం కోర్టు మేజిస్ట్రేట్ దేవి మానస తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి 9 మందిని కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. ఇద్దరికి రెండురోజులు, ఏడుగురికి ఒక రోజు జైలు శిక్ష వి«ధించారన్నారు. సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒకరికి ఏడు రోజులు, ఒకరికి మూడు రోజులు, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించారన్నారు. మునిపల్లి పోలీస్‌స్టేషన్ నుండి 11 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా వారిలో ఇద్దరికి మూడు రోజులు, ముగ్గురికి రెండు రోజులు, ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష విదించారన్నారు. బీడీఎల్ బానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకరిని కోర్టులో హాజరు పర్చగా ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ సంజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment