కాచిగూడ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మందికి కోర్టు ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్షతో పాటు రూ. 2 వేల అపరాధ రుసుం విధించింది. ఈ మేరకు కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.జ్ఞానేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లో మధ్యం సేవించి వాహనాలు నడుపుతున్న 21మందిపై కేసులు నమోదు చేసి శుక్రవారం ఎర్రమంజిల్ కాలనీలోని 3 వ ఎంఎం కోర్టులో హాజరుపరిచారు. వారిలో 8 మందికి న్యాయమూర్తి రూ. 2 వేలు ఫైన్ విధించగా, మరో 8 మందికి రూ. 2 వేలు ఫైన్‌తో పాటు జైలు శిక్ష విధించారు. మరో అయిదుగురికి రూ. 2 వేలు ఫైన్‌తో పాటు సోషల్ సర్వీస్‌లో సేవలు అందించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.