హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మూడవ ఎంఎం కోర్టు 19మందికి రూ.2000 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించిందని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి.జ్ఞానేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 టూవీలర్స్, 2 త్రీ వీలర్స్, 1 ఫోర్ వీలర్, 4 ఇతర వాహనాలు మొత్తం 15మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 50 మందిని కోర్టులో హాజరు పర్చగా వారిలో పలువురికి కొన్నిరోజుల పాటు సోషల్ సర్వీసు చేయాలని, 17 మందికి రూ.2 వేలు చొప్పున కోర్టు ఫైన్ విధించిందని ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే శిక్ష, జరిమానాతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ కూడా రద్దవుతుందని, అందువల్ల మద్యం సేవించి వాహానాలు నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
'ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు'
Published Thu, Jul 14 2016 9:08 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement