మెల్‌బోర్న్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కమిటీ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లోని బాక్‌లాట్ స్టూడియోస్, 64 హెగ్ స్ట్రీట్‌లో యాత్ర చిత్రాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ కౌశిక్ మామిడి, రమణారెడ్డి, లోకేశ్ కాసు, అజయ్ ముప్పలనేని, రమేష్ బొల్ల, రమ్య యార్లగడ్డలతోపాటూ వైఎస్సార్ అభిమానులు చిత్రాన్ని వీక్షించారు. మహానేత వైఎస్సార్‌ను ప్రతిబింబించేలా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment