మెల్‌బోర్న్‌లో టీమిండియాకు అరుదైన గౌరవం.. | T20 WC 2022:Team India Meets Governor Of Victoria Melbourne Pics Viral | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో టీమిండియాకు అరుదైన గౌరవం..

Published Fri, Oct 21 2022 9:50 PM | Last Updated on Tue, Oct 25 2022 5:31 PM

T20 WC 2022:Team India Meets Governor Of Victoria Melbourne Pics Viral - Sakshi

టి20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు అరుదైన గౌరవం లభించింది. మెల్‌బోర్న్‌ వేదికగా అక్టోబర్‌ 23న భారత జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఆడేందుకు ఇప్పటికే ఇరుజట్లు మెల్‌బోర్న్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత జట్టు శుక్రవారం మెల్‌బోర్న్‌గవర్నర్‌ లిండా డెస్సాను మర్యాద పూర్వకంగా కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.

మెల్‌బోర్న్‌ గవర్నర్‌ లిండా డెస్సా కూడా తన సోషల్‌ మీడియాతో టీమిండియాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడం విశేషం.''ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు వచ్చిన భారత జట్టుకు హోస్ట్ సిటీగా గవర్నమెంట్ భవనంలో స్వాగత కార్యక్రమం నిర్వహించాం.''అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

కాగా శుక్రవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం కానుండడంతో అసలు మజా మొదలవనుంది. క్వాలిఫయింగ్‌ పోరులో రెండు గ్రూఫ్‌ల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-12లో అడుగుపెట్టాయి. గ్రూఫ్‌-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్‌.. గ్రూఫ్‌-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌లు అర్హత సాధించాయి. 

ఇక గ్రూఫ్‌-2లో టీమిండియాతో పాటు పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, జింబాబ్వే, నెదర్లాండ్స్‌లు ఉన్నాయి. టీమిండియా ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. 2007లో తొలి ఎడిషన్ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆ తర్వాత ఈ ట్రోఫీని ముద్దాడలేదు. గతేడాది ఫేవరెట్లుగా బరిలో దిగినప్పటికీ తొలి రెండు మ్యాచుల్లో చెత్త ప్రదర్శనతో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. 

చదవండి: సూపర్‌-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్‌, వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement