
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు, అభిమానుల ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిగా ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకుడు దినేష్ గోరిసెట్టి, ఎం.టి.ఎఫ్ సంఘం అధ్యక్షుడు వెంకట్ నూకాల హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనా ధీమా వ్యక్తం చేశారు. తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కలిల్ కాట్‌పల్లి, వినాయక్ కొలపేలతో పాటు దాదాపు మూడువేల మంది ప్రవాసభారతీయులు పాల్గొన్నారు.




