
మెల్‌బోర్న్ : అస్ట్రేలియా లిబరల్ పార్టీ(విక్టోరియా డివిజన్) ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. విలియమ్‌టౌన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి రమ్య యార్లగడ్డ, రాజేశ్ సక్కమూరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రమ్య యార్లగడ్డ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మద్దతు తెలపాలని లిబర్ పార్టీ నాయకుడు గౌరి శెట్టి కోరడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిథిగా హాజరైన అస్ట్రేలియా లిబరల్ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్‌కు ప్రజల కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని, పాదయాత్ర గురించి ఆయనకు వివరించామన్నారు.
అనంతరం సీన్ ఆర్మిస్టెడ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం వైఎస్. జగన్ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య యార్లగడ్డతో పాటు విక్టోరియా కన్వీనర్ కౌశిక్ మామిడి, సురెందర్ కుమార్ ,పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment