
కోహ్లి కొత్త అవతారం...
భారత క్రికెటర్లు ప్రతీ మ్యాచ్‌కు ఒక్కొక్కరు కొత్తగా కనిపించేందుకు సిద్ధమయ్యారేమో. నిన్న శిఖర్ ధావన్ ‘మొహక్’ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తే ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వంతు.
మెల్‌బోర్న్: భారత క్రికెటర్లు ప్రతీ మ్యాచ్‌కు ఒక్కొక్కరు కొత్తగా కనిపించేందుకు సిద్ధమయ్యారేమో. నిన్న శిఖర్ ధావన్ ‘మొహక్’ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తే ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి వంతు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు కొత్త హెయిర్‌స్టైల్‌తో విరాట్ బరిలోకి దిగబోతున్నాడు. గురువారం అతను ఇందు కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాడు.
హోటల్ రూమ్‌నుంచి బయటికి వచ్చి, మెల్‌బోర్న్ వీధుల్లో కొద్ది దూరం నడిచి వెళ్లిన అతను, నగరంలోని ప్రఖ్యాత ‘టోనీ అండ్ గై’ సెలూన్‌కు చేరుకున్నాడు. కొన్ని గంటల అనంతరం కోహ్లి డిఫెరెంట్ లుక్‌తో బయటికి వచ్చాడు. తలకు రెండు వైపులా జుట్టును తగ్గించి మధ్యలో దువ్వినట్లుగా ఉండే ఈ లుక్ ఇటీవల ప్రఖ్యాత ఫుట్‌బాలర్ క్రిస్టియానా రొనాల్డో కనిపిస్తున్న ‘సీఆర్7’ స్టైల్ పోలికలతో ఉంది. కోహ్లి కొత్త లుక్ అభిమానులతో పాటు జట్టు సహచరులను కూడా ఆశ్చర్యపరచింది.