ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బిజీగా ఉండే ఫ్లిండర్స్ స్ట్రీట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 14 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.