స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. కరోనా సంక్షభంతో రెండేళ్లు వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఆగస్టు 12 నుంచి అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా తనకు ఇన్విటేషన్ రావడం పట్ల సామ్ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌లో భాగమయ్యాను ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిథిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిద్యం వహించడం నాకు గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారతీయ సినిమాలను, భారతీయులు, సినీ ప్రేమికులు, ఇతరులందరిని ఇలా ఒక్కచోట చేర్చడం అనేది ఒక గొప్ప అనుభూతి'. అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా నాగ చైతన్య నుంచి విడిపోయాక సామ్ కెరీర్ ముగిసినట్లేనని అందర భావించారు. అయితే అలాంటి వాటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం శాకుంతలం, యశోద అనే రెండు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు, విజయ్ దేవరకొండకు జంటగా ‘ఖుషి’లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment