మెల్‌బోర్న్‌లో ఉగ్రవాది కలకలం | Hostage situation at apartment in Melbourne | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో ఉగ్రవాది కలకలం

Published Mon, Jun 5 2017 3:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

మెల్‌బోర్న్‌లో ఉగ్రవాది కలకలం

మెల్‌బోర్న్‌లో ఉగ్రవాది కలకలం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ పట్టణంలో కలకలం రేగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్‌లో పేలుడు సంభవించడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ఆ భవనంలో ఎవరో ఒక దుండగుడు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ అపార్ట్‌మెంట్‌ వద్ద పెద్ద మొత్తంలో అత్యవసర సేవల విభాగం అధికారులు మోహరించారు.

కొంతమంది లోపల ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్న ఆ వ్యక్తి కచ్చితంగా ఒక మహిళను బందీ చేసినట్లుందని అధికారులు చెబుతున్నారు. అతడు ఉగ్రవాది అయ్యుంటాడని అనుమానిస్తున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు రావడంతో దాదాపు ఆ అపార్ట్‌మెంట్‌ ఉన్న కాలనీలోని షాపింగ్‌ మాల్స్‌ మొత్తం మూసివేశారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement