భారత్‌ను తక్కువ అంచనా వేయం: హాడిన్
మెల్‌బోర్న్: వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్‌ను తక్కువ అంచనా వేయడం లేదని... రాబోయే మ్యాచ్‌ల్లో భారత్ జట్టు మరింత దూకుడుగా ఆడుతుందని ఆస్ట్రేలియా వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ‘ఇప్పటికే టీమిండియా సత్తా ఏంటో చూపింది. ఇక నుంచి మరింత దూకుడును చూపిస్తుంది.
కాబట్టి మా మిడిల్, లోయర్ ఆర్డర్ బాగా రాణించాల్సిన అవసరం ఉంది. జాన్సన్ మరోసారి తన పవర్‌ను చూపించాలి’ అని హాడిన్ పేర్కొన్నాడు. గాబాలోని ప్రాక్టీస్ పిచ్‌పై భారత జట్టు ఫిర్యాదు చేయడాన్ని వికెట్ కీపర్ విమర్శించాడు. పిచ్‌లలో ఏం లోపం ఉందో చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ‘మ్యాచ్ తర్వాత అదే వికెట్‌పై భారత్ ప్రాక్టీస్ చేసింది. తర్వాత మా బౌలర్లు కూడా దానిపైనే ప్రాక్టీస్ చేశారు. అప్పుడు లేని లోపం మ్యాచ్ తర్వాత ఏం కనబడిందో’ అని హాడిన్ తెలిపాడు. స్మిత్ కెప్టెన్సీకి మద్దతిచ్చిన హాడిన్... సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారన్నాడు. ప్రస్తుతం స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్నాడు. ఈ సిరీస్‌లో తాను పరుగులు చేయలేకపోవడంపై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్ లయోన్‌పై ప్రశంసలు కురిపించాడు.