93,013 | 93,013 | Sakshi
Sakshi News home page

93,013

Mar 30 2015 2:43 AM | Updated on Sep 2 2017 11:33 PM

93,013

93,013

మెల్‌బోర్న్‌లో ఆదివారం ఫైనల్ చూసిన ప్రేక్షకుల సంఖ్య. ఓ మ్యాచ్‌ను క్రికెట్ చరిత్ర లో ఇంత మంది చూడటం ఇదే తొలిసారి. 1992 ప్రపంచకప్ ఫైనల్‌ను 87,182 మంది చూశారు.

మెల్‌బోర్న్‌లో ఆదివారం ఫైనల్ చూసిన ప్రేక్షకుల సంఖ్య. ఓ మ్యాచ్‌ను క్రికెట్ చరిత్ర లో ఇంత మంది చూడటం ఇదే తొలిసారి. 1992 ప్రపంచకప్ ఫైనల్‌ను 87,182 మంది చూశారు. 2013 యాషెస్ సిరీస్‌లో తొలి రోజు 91,112 మంది స్టేడియానికి వచ్చారు. ఆ రికార్డును కూడా ఆదివారం మ్యాచ్ అధిగమించింది.
 
5  ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలవడం ఇది ఐదోసారి. వెస్టిండీస్, భారత్ రెండుసార్ల చొప్పున గెలిచాయి.
400 న్యూజిలాండ్, ఆసీస్‌ల ఫైనల్ ప్రపంచకప్ చరిత్రలో 400వ మ్యాచ్. ఓవరాల్‌గా ఇప్పటివరకు 3,646 వన్డేలు జరిగాయి.
547  టోర్నీలో గప్టిల్ చేసిన పరుగులు. న్యూజిలాండ్ తరఫున ప్రపంచకప్‌లో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గప్టిల్
22 టోర్నీలో బౌల్ట్, స్టార్క్ తీసిన వికెట్లు. న్యూజిలాండ్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బౌల్ట్.
1 ప్రపంచకప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో 50కు పైగా స్కోర్లు చేసిన తొలి ఆటగాడు స్టీవ్‌స్మిత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement