మహిళల యాషెస్ 2023లో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మూనీ(32), గార్డెనర్(32), పెర్రీ(34) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో నాట్ స్కివర్ రెండు, డీన్, బెల్, గిబ్సన్, ఎకిలస్టన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇన్నింగ్స్ అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 14 ఓవర్లకు 119 పరుగులగా కుదించారు.
అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ విజయంలో అలీస్ క్యాప్సీ(46) పరుగులతో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్, జానెసన్, జార్జీయా తలా వికెట్ సాధించారు.
కాగా అంతకుముందు యాషెస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మహిళల యాషెస్ 2023లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఇరు జట్లు తలపడనున్నాయి. జూలై 12 బ్రిస్టల్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు!
Comments
Please login to add a commentAdd a comment