నాటింగ్‌హామ్: దక్షిణాఫ్రికాతో కెన్నింగ్టన్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అదిల్ రషిద్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద స్టోక్స్ అందుకున్న ఆండిల్ ఫెహ్లుకోవియా క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కాగా, తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మరో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ఒక అదిరే క్యాచ్‌తో ఇంగ్లండ్ అభిమానులకు మంచి మజాను అందించాడు. మొన్నటి స్టోక్స్ క్యాచ్‌ను గుర్తుకు చేస్తూ ఔరా అనిపించాడు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లిష్ స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 21 ఓవర్ తొలి బంతిని ఇమాముల్ హక్ లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అది ఫోర్ వెళుతుందనుకున్న తరుణంలో వోక్స్ పరుగెత్తుకొచ్చి బంతిని అందుకోవడం స్టేడియంలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన వోక్స్ డైవ్‌కొట్టి మరీ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో ఇమాముల్ హక్(44) భారంగా పెవిలియన్ చేరాడు. ఇమాముల్ హక్ పెవిలియన్‌కు చేరడంతో పాకిస్తాన్ 111 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అంతకుముందు ఫకార్ జమాన్(36) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో ఫకార్ జమాన్ స్టంపౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పాక్ బ్యాటింగ్ చేపట్టింది. పాక్ బ్యాటింగ్‌ను ఫకార్ జమాన్-ఇమాముల్ హక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 82 పరుగులు జత చేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
క్రిస్ వోక్స్ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్
Comments
Please login to add a commentAdd a comment