Chris Woakes Likely To Miss The First Test Opener Vs New Zealand At Lords, Details Inside - Sakshi
Sakshi News home page

ENG vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

Published Tue, May 10 2022 8:03 PM | Last Updated on Tue, May 10 2022 8:44 PM

Chris Woakes likely to miss the first Test vs New Zealand at Lords - Sakshi

ఇంగ్లండ్‌ స్వదేశాన న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగా జూన్ 2 నుంచి ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్ వోక్స్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్ పర్యటనలో గాయపడిన క్రిస్ వోక్స్‌ ఇంకా కోలుకోలేనట్టు తెలుస్తోంది.

కాగా న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్‌ త్వరలోనే జట్టును ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్‌ నూతన టెస్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. యాషెస్‌ సిరీస్‌లో ఓటమి, విండీస్‌ పర్యటనలో ఘోర పరాభావం ఎదురుకావడంతో జో రూట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

చదవండి: Graham Thorpe Health: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్‌ హెడ్‌ కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement