Lords
-
#Sourav Ganguly: లార్డ్స్‌లో 'దాదా' గిరి
సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. టీమిండియా అత్యంత విజయంవతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఈ బెంగాల్ టైగర్.. ఇండియన్ క్రికెట్ దిశదశను మార్చేశాడు. అప్పటివరకు విజయాలపై సచిన్‌పై ఆధారపడ్డ భారత్‌కు.. ఎంతో మంది మ్యాచ్ విన్నర్లను పరిచయం చేశాడు. యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లు అతడి సారథ్యంలోనే వెలుగులోకి వచ్చినవారే. అయితే అద్భుతమైన ఆటగాడిగా, నాయకుడిగా నిలిచిన గంగూలీకి.. వరల్డ్‌కప్ టైటిల్ ఒక్కటే అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలిచిన బెంగాల్ దాదా... 2003 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చవిచూశాడు. అయితే కెప్టెన్‌గా గంగూలీ సాధించిన విజయాలు ప్రపంచకప్‌లతో సమానం. అతడు భారత్‌కు అందించిన చారిత్రత్మక విజయాల్లో 2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ ఒకటి. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయనంతరం గంగూలీ ప్రతిష్టాత్మక లార్డ్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి చేసుకున్న సంబరాలను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. అంతలా దాదా సెలబ్రేషన్స్ జరపుకోవడం వెనక ఓ కథ దాగి ఉంది.ఇంగ్లండ్-భారత్ ఫైనల్ పోరు..2002 ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకాల్లో భాగంగా భారత జట్టు నాట్‌వెస్ట్ ట్రై సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు శ్రీలంక, భారత జట్లు భాగమయ్యాయి. శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ఇంటిముఖం పట్టగా.. టీమిండియా, ఇంగ్లండ్ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాయి. అయితే ఈ సిరీస్ మొత్తం ఒక లెక్క.. ఫైనల్ మ్యాచ్ ఒక లెక్క. 2002 జూలై 13.. క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరులో ఇంగ్లండ్-భారత జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్కస్ ట్రెస్కోథిక్(109), నాజర్ హుస్సేన్(119) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్ల జహీర్ ఖాన్(మూడు వికెట్లు) మినహా మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు.యువీ, కైఫ్ అద్భుత పోరాటం..326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (45; 49 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), సౌరవ్ గంగూలీ (60; 43 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే వీరిద్దరి ఔటయ్యాక అస్సలు కథ మొదలైంది. వెంటవెంటనే దినేశ్ మోంగియా (9), సచిన్ (14), ద్రవిడ్ (5) వికెట్లను భారత్ కోల్పోయింది. 146/5 తో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అదే సమయంలో క్రీజులో ఉన్న యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుతం చేశారు. ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను తమ విరోచిత పోరాటంతో వారిద్దరూ గెలుపు బాట పట్టించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. యువరాజ్ సింగ్ (69, 63 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్; 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరి అద్బుత పోరాటం ఫలితంగా భారత్ మరో 3 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఆఖరిలో జహీర్ ఖాన్ విన్నింగ్ రన్స్ కొట్టగానే లార్డ్స్ మైదానం భారత అభిమానుల చప్పట్ల హోరుతో దద్దరిల్లిపోయింది.గంగూలీ స్వీట్ రివెంజ్..అభిమానులతో పాటు భారత జట్టు మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఈ క్రమంలో లార్డ్స్ బాల్కనీలో ఉన్న టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి గిరా గిరా తిప్పుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ క్షణంలో దాదా ఆనందానికి అవధులు లేవు. అయితే గంగూలీ అంతగా రియాక్ట్ అవ్వడం వెనక ఓ కారణం దాగి ఉంది. అదే ఏడాది ముంబై వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన ఆరో వన్డే మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. ఆండ్రూ ఫ్లింటాప్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన వెంటనే ఫ్లింటాప్ తన షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది మన బెంగాల్ టైగర్‌ను నచ్చలేదు. ఆ రోజే సౌరవ్ ఫిక్స్ అయ్యాడు.. ఈ ఇంగ్లీష్ జట్టుకు వాళ్ల సొంతగడ్డపైనే అదిరిపోయే సమాధానం చెప్పాలని. తను అనుకున్న విధంగానే ఇంగ్లండ్‌ను ప్రతిష్టాత్మక లార్డ్ మైదానంలో ఓడించి.. తన స్వీట్ రివెంజ్ను తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని గంగూలీనే చాలా సార్లు స్వయంగా వెల్లడించాడు.వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే..అయితే ఆ మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని గంగూలీని ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశ్నించాడు. . 'లార్డ్స్ అంటే ప్రపంచ క్రికెట్‌కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా? అని బాయ్‌కాట్ అడగ్గా.. వాంఖడే కూడా మాకు లార్డ్స్ లాంటిదే. ఫ్లింటాఫ్ అలా చేయొచ్చా' అని గంగూలీ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. -
ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
లండన్: ఐర్లాండ్ జట్టు పోరాటంతో ఇంగ్లండ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి రాగా... తుది ఫలితం మాత్రం ఊహించిన విధంగానే వచి్చంది. లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో శనివారం ముగిసిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 97/3తో ఆట కొనసాగించిన ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 363 పరుగులకు ఆలౌటైంది. మార్క్ ఎడైర్ (88) ఆండీ మెక్‌బ్రైన్ (86 నాటౌట్) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో తొలి టెస్టు ఆడిన జోష్ టంగ్ (5/66) ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 11 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ తొలి 4 బంతుల్లోనే 3 ఫోర్లతో అందుకుంది. చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్ -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక దశలో అనుకూలంగా కనిపించేదంతా రివర్స్ అయిపోతుంటుంది. తాజాగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో విషయంలో ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో బెయిర్ స్టో టెస్టులను కూడా టి20 స్టైల్లో ఆడుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, భారత్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఇదే దూకుడు కనబరిచిన బెయిర్ స్టో మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో చెలరేగిపోతున్న బెయిర్ స్టో సెంచరీలతో కథం తొక్కాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మరోసారి నిరూపితం అయింది. తాజాగా లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి బెయిర్ స్టోను క్లీన్‌బౌల్డ్ చేసింది. గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేయగా.. వికెట్ మొత్తం బయటటికి వచ్చింది. నోర్ట్జే ఎంత వేగంతో బంతిని వేశాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టును ఇంగ్లండ్ ఫేలవంగా ఆరంభించింది. తొలి సెషన్లోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా అందుకు తగ్గ ఫలితం సాధించింది. పేసర్లు నోర్ట్జే, రబాడలు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. వర్షం అంతరాయంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓలీ పోప్(61 బ్యాటింగ్).. ఒక్కడే ప్రొటిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా స్టువర్ట్ బ్రాడ్(0) క్రీజులో ఉన్నాడు. Anrich Arno Nortje -
Ind Vs Eng: రోహిత్ సేన రెండో వన్డేలో గనుక గెలిచిందంటే!
India Vs England ODI Series 2022: మొదటి వన్డేలో గెలుపుతో జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్‌తో రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 14) తలపడనుంది. ఓవల్ వన్డేలో ఏకపక్ష విజయంతో సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచిన రోహిత్ సేన సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇక సొంతగడ్డపై తొలిసారి 10 వికెట్ల తేడాతో ఓడి చెత్త రికార్డు మూటగట్టుకున్న బట్లర్ బృందం ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. A bad day at the office as Bumrah and Sharma dominate 🏏 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/kw2ZrlOVFH — England Cricket (@englandcricket) July 13, 2022 ఈ క్రమంలో ఇంగ్లండ్- టీమిండియా మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. మరి పిచ్, వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, ఇతర వివరాలు పరిశీలిద్దాం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో వన్డే వేదిక: లార్డ్స్, లండన్ సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆరంభం చానెల్: సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం చక్కటి బ్యాటింగ్ పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం సమస్య లేదు. టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. తుది జట్ల అంచనా: టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, యజువేంద్ర చహల్. ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, రీస్ టోప్లే, క్రెయిగ్ ఒవర్టన్/స్యామ్ కరన్. మీకు తెలుసా? 2020 తర్వాత ఆసియేతర దేశాల్లో ఆడిన మూడు వన్డే సిరీస్‌లను టీమిండియా కోల్పోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాలు చవిచూసింది. ఇంగ్లండ్‌తో తాజా రెండో వన్డేలో గనుక గెలిస్తే సుమారు రెండేళ్ల తర్వాత విదేశీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన భారత జట్టుగా రోహిత్ సేన నిలుస్తుంది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జూలై 17న జరుగనుంది. చదవండి: Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే! ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? -
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
ఇంగ్లండ్ స్వదేశాన న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జూన్ 2 నుంచి ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్ పర్యటనలో గాయపడిన క్రిస్ వోక్స్ ఇంకా కోలుకోలేనట్టు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ త్వరలోనే జట్టును ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్ నూతన టెస్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికైన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఓటమి, విండీస్ పర్యటనలో ఘోర పరాభావం ఎదురుకావడంతో జో రూట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చదవండి: Graham Thorpe Health: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్ -
ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్దే 'హండ్రెడ్ మెన్స్'
లార్డ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2021 టైటిల్‌ను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకుంది. బర్మింగ్హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్లో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సదరన్ బ్రేవ్ తొలి చాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్.. ఐర్లాండ్ ఆటగాడు.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్( 36 బంతుల్లో 61;6 సిక్సర్లు, 2 ఫోర్లు) సిక్సర్ల వర్షానికి తోడూ.. చివర్లో రాస్ విట్లీ(19 బంతుల్లో 44 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చదవండి: మహిళల ‘హండ్రెడ్’ విజేత ఓవల్ ఇన్విన్సిబుల్స్ అనంతరం బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్ హీరో లియామ్ లివింగ్స్టన్(19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి మెరుపులు మెరిపించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. చివర్లో బెంజమిన్ 23, బెన్నీ హౌవెల్ 20 నాటౌట్‌గా నిలిచారు. ఇక సదరన్ బ్రేవ్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్, క్రెగ్ ఓవర్టన్, టైమెల్ మిల్స్, జేక్ లిన్టోట్ తలా ఒక వికెట్ తీశారు. అద్భుత ఇన్నింగ్స్‌తో సదరన్ బ్రేవ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టిర్లింగ్‌కు ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'' వరించగా.. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన లియాయ్ లివింగ్స్టన్ ''ప్లేయర్ ఆఫ్ ది సిరీస్''గా నిలిచాడు. చదవండి: Manan Sharma: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్ -
మొయిన్ అలీ అరుదైన రికార్డు; టీమిండియాపై ఆరో స్పిన్నర్‌గా
లార్డ్స్: ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్‌గా మొయిన్ అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో షమీ వికెట్ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా భారత్‌పై టెస్టుల్లో మురళీధరన్(శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. నాథన్ లియాన్(ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో, 63 వికెట్లతో లాన్స్ గిబ్స్(వెస్టిండీస్) మూడో స్థానంలో, అండర్వుడ్(ఇంగ్లండ్) 62 వికెట్లతో నాలుగు.. 52 వికెట్లతో బెనాడ్(ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో చేరిన మొయిన్ అలీ ఇంగ్లండ్ తరపున 62 టెస్టుల్లో 2831 పరుగులు.. 190 వికెట్లు, 112 వన్డేల్లో 1877 పరుగులు.. 87 వికెట్లు, 38 టీ20ల్లో 437 పరుగులు.. 21 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా రెండో రోజు ఆటలో లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 31, ఇషాంత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 278/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు ఇన్నింగ్స్‌కు కొనసాగించారు. అయితే 37 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. -
IND Vs ENG Day 2: వరుస బంతుల్లో రెండు వికెట్లు.. ఇంగ్లండ్ 41/2
వరుస బంతుల్లో రెండు వికెట్లు.. ఇంగ్లండ్ 41/2 ►టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తడబడుతుంది. సిరాజ్ వరుస బంతుల్లో సిబ్లీ, హసీబ్ హమీద్‌లను పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు బ్రేక్ అందించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ 18, జో రూట్ 10 పరుగుతో క్రీజులో ఉన్నారు. అండర్సన్ పాంచ్ పటాకా.. టీమిండియా ఆలౌట్ ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. 40 పరుగులు చేసిన జడేజా మార్క్‌వుడ్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 129 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ 83, కోహ్లి 42, జడేజా 40 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో దుమ్మురేపగా.. మార్క్ వుడ్, రాబిన్సన్లు చెరో రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. ఇషాంత్ శర్మ ఔట్.. ఎనిమిదో వికెట్ డౌన్ ►లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఇషాంత్ శర్మ రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఇషాంత్ అండర్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా జడేజా 39 పరుగులతో తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. లంచ్ విరామం.. టీమిండియా స్కోరు 346/7 ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు ఆటలో లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 31, ఇషాంత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 278/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు ఇన్నింగ్స్‌కు కొనసాగించారు. అయితే 37 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. షమీ కూడా వెంటనే వెనుదిరగడంతో ఏడు వికెట్లు కోల్పోయి లంచ్ విరామానికి వెళ్లింది. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వెనువెంటనే ఏడు వికెట్ కోల్పోయింది. పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షమీ పరుగులేమి చేయకుండానే మొయిన్ అలీ బౌలింగ్‌లో రోరీ బర్న్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. జడేజా 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రిషబ్ పంత్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా ►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పంత్ మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రహానే ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికి భారీస్కోరుగా మలచలేకపోయాడు. ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. వెనువెంటనే రెండు వికెట్లు.. టీమిండియా 283/5 టీమిండియాతో రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ కేఎల్ రాహుల్, అజింక్యా రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. మొదట 129 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఓలి రాబిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 91 ఓవర్ రెండో బంతికి సిబ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 92వ ఓవర్ తొలి బంతికే 1 పరుగు చేసిన రహానే రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 4, జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటిరోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో దుమ్మురేపడం.. మరో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులతో రాణించడంతో భారత్ తొలిరోజే భారీ స్కోరు సాధించింది. పుజారా 9 పరుగులకే వెనుదిరిగినప్పటికి.. విరాట్ కోహ్లి 42 పరుగులతో మంచి టచ్‌లో కనిపించినా దానిని భారీస్కోరుగా మలచలేకపోయాడు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. సెంచరీతో జోరుమీదున్న రాహుల్‌కు రహానే మద్దతు ఇస్తే టీమిండియాకు లార్డ్స్ టెస్టుపై పట్టు చిక్కినట్లే. -
ఆ భయం నాకు లేదు: గంగూలీ
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల క్రితం తన టెస్టు అరంగేట్రాన్ని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి నెమరువేసుకున్నాడు. తన టెస్టు అరంగేట్రం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరగ్గా, అందుకు తాను పూర్తి స్థాయిలో సిద్ధమై అక్కడకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. తన తొలి టెస్టుకు ఎటువంటి భయం లేకుండా ఉండటంతోనే సెంచరీ చేశానని గంగూలీ స్పష్టం చేశాడు. అది అరంగేట్రం టెస్టు మ్యాచ్ అనే భయం తనకు లేదన్నాడు. ‘ 1996లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌కు అసాధారణమైన మైండ్‌సెట్‌తో ఉన్నా. నాకు భయం అని ఎక్కడ అనిపించలేదు. ఆ పర్యటనకు వెళ్లాను.. ఆడాను అన్నట్లే ఉంది నా పరిస్థితి. ఇంగ్లండ్ పర్యటనలో తొలి వార్మప్ మ్యాచ్‌కు బ్రిస్టల్ వెళ్లగా ఆ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యా. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 70 పరుగులు చేశా. ఇలా ఆ సిరీస్‌లో పరిణితి చెందుతూనే ముందుకు సాగా’ అని గంగూలీ తెలిపాడు.అయితే తాను ఫాస్ట్ బౌలింగ్‌ను ఆడలేనని అభిమానులు ఎక్కువగా మాట్లాడుకునేవారన్నాడు. కాకపోతే తన చేతికి బ్యాట్ ఇస్తే పరుగులు చేయడమే తెలుసన్నాడు. ఇక్కడ అది ఫాస్ట్ బౌలింగా.. స్పిన్ బౌలింగ్ అనేది తనకు తెలీదన్నాడు. అదే సమయంలో ఫామ్‌లో ఉండటం, ఫామ్‌లో లేకపోవడం అనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకునే వాడిని కాదని గంగూలీ పేర్కొన్నాడు. -
లార్డ్స్ టెస్టులో భారత్ ఘోర పరాజయం
-
అదే కథ...అదే వ్యథ
తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లు... ఇప్పుడు 47 ఓవర్లు... మొదటి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు... ఈసారి 130కి ఆలౌట్... అదనపు ఓవర్లు, మరికొన్ని పరుగులు మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్... రెండో టెస్టులో భారత జట్టు ఆట, రాత ఏమీ మారలేదు. మరోసారి బ్యాట్స్‌మెన్ ఘోర ప్రదర్శన టీమిండియాకు విదేశీ గడ్డపై మరో పరాభవాన్ని మిగిల్చింది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బ్యాటింగ్‌కు పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నా మనోళ్లు కనీస పట్టుదల కనబర్చలేకపోయారు... కాస్త గట్టిగా నిలబడితే ఆపై వరుణుడు అండగా నిలిచేవాడేమో కానీ అదీ జరగలేదు. తొలి రోజు వర్షంతో కోల్పోయిన పూర్తి ఆటను మినహాయిస్తే మూడు రోజుల్లోపే మ్యాచ్ ముగిసినట్లు. నంబర్‌వన్ హోదాలో ఎంతో ఉత్సాహంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన కోహ్లి సేన 0–2తో వెనుకబడి ఇక కోలుకోగలదా! లండన్: అనూహ్యం ఏమీ జరగలేదు... మ్యాచ్ మూడో రోజే భారీ ఆధిక్యం కోల్పోయి ఆశలు కోల్పోయిన భారత జట్టు ఆదివారం కూడా బ్యాటింగ్‌లో కుప్పకూలింది. ఫలితంగా రెండో టెస్టులో చిత్తుగా ఓడింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 159 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు వెనుకబడిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (48 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెరో 4 వికెట్లతో భారత్‌ను కుప్పకూల్చగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ వోక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 18 నుంచి నాటింగ్‌హామ్‌లో మూడో టెస్టు జరుగుతుంది. తీరు మారలేదు... తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం కోల్పోయిన భారత జట్టుకు రెండో ఇన్నింగ్స్ కూడా ఏమాత్రం కలిసి రాలేదు. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి మన బ్యాట్స్‌మెన్ మరోసారి దాసోహమయ్యారు. ఆరంభంలో అండర్సన్ తన వంతు పాత్ర పోషించగా, ఆ తర్వాత బ్రాడ్ చెలరేగాడు. అండర్సన్ దెబ్బకు విజయ్ (0) మళ్లీ డకౌట్ ‘పెయిర్’గా వెనుదిరగ్గా... రాహుల్ (10) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో పుజారా, రహానే పరుగులు చేయలేకపోయినా కొద్ది సేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే బ్రాడ్ బౌలింగ్ భారత్‌ను దెబ్బ తీసింది. దూరంగా వెళుతున్న బంతికి వెంటాడి రహానే (13) స్లిప్‌లో క్యాచ్ ఇవ్వగా, అప్పటి వరకు ఎంతో ఓపిగ్గా ఆడిన పుజారా (87 బంతుల్లో 17; 1 ఫోర్) చక్కటి ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. కొద్ది సేపటికి బ్రాడ్ వేసిన మరో ఓవర్ భారత్ పరిస్థితిని దిగజార్చింది. షార్ట్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చి కోహ్లి (17) వెనుదిరగ్గా, తర్వాతి బంతికే దినేశ్ కార్తీక్ (0) పెవిలియన్ చేరాడు. తన 7 ఓవర్ల స్పెల్‌లో బ్రాడ్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. ఈ దశలో పాండ్యా, అశ్విన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. పేసర్ల దెబ్బలను ఓర్చుకుంటూ వీరిద్దరు కొద్దిసేపు పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. అయితే పాండ్యాను వోక్స్ ఔట్ చేయగా...కుల్దీప్ (0), షమీ (0) వికెట్లు అండర్సన్ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత ఇషాంత్ (2)ను కూడా వోక్స్ ఔట్ చేయడంతో భారత్ పోరు ముగిసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 357/6తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వోక్స్, కరన్ (49 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) చకచకా పరుగులు జోడించారు. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ 7.1 ఓవర్లలో 39 పరుగులు చేసింది. షమీ వేసిన ఓవర్లో ఆ జట్టు 2 ఫోర్లు, సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టింది. అయితే హార్దిక్ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి కరన్ వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 396/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 107; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 396/7 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 0; లోకేశ్ రాహుల్ (ఎల్బీ) (బి) అండర్సన్ 10; పుజారా (బి) స్టువర్ట్ బ్రాడ్ 17; రహానే (సి) జెన్నింగ్స్ (బి) స్టువర్ట్ బ్రాడ్ 13; విరాట్ కోహ్లి (సి) పోప్ (బి) స్టువర్ట్ బ్రాడ్ 17; హార్దిక్ పాండ్యా (ఎల్బీ) (బి) వోక్స్ 26; దినేశ్ కార్తీక్ (ఎల్బీ) (బి) స్టువర్ట్ బ్రాడ్ 0; అశ్విన్ (నాటౌట్) 33; కుల్దీప్ యాదవ్ (బి) అండర్సన్ 0; షమీ (ఎల్బీ) (బి) అండర్సన్ 0; ఇషాంత్ (సి) పోప్ (బి) వోక్స్ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (47 ఓవర్లలో ఆలౌట్) 130. వికెట్ల పతనం: 1–0; 2–13; 3–35; 4–50; 5–61; 6–61; 7–116; 8–121; 9–125; 10–130. బౌలింగ్: అండర్సన్ 12–5–23–4; స్టువర్ట్ బ్రాడ్ 16–6–44–4; క్రిస్ వోక్స్ 10–2–24–2; కరన్ 9–1–27–0. ► 1 కోహ్లి సారథ్యంలో భారత్ తొలిసారి ఓ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. 2014 ఓవల్ టెస్టులో (ఇన్నింగ్స్ 244 పరుగులు) తర్వాత భారత్‌కిదే తొలి ఇన్నింగ్స్ పరాజయం. ► 2 గ్యారెత్ బ్యాటీ (బంగ్లాదేశ్‌పై లార్డ్స్‌లో 2005లో) తర్వాత ఇంగ్లండ్ తుది జట్టులో సభ్యుడిగా ఉండి బౌలింగ్ చేసే అవకాశం, బ్యాటింగ్ చేసే అవకాశం, క్యాచ్ కూడా పట్టని రెండో ఇంగ్లండ్ ప్లేయర్‌గా ఆదిల్ రషీద్ గుర్తింపు పొందాడు. ► 1 భారత్ తరఫున ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో టాప్ స్కోరర్‌గా నిలిచిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రవిచంద్రన్ అశ్విన్ (29; 33 నాటౌట్) ఘనత వహించాడు. ► 6 రెండు ఇన్నింగ్స్‌లలో సున్నాకే ఔటైన ఆరో భారత బ్యాట్స్‌మన్ విజయ్ ► 5 మ్యాచ్‌లో ఆడిన మొత్తం ఓవర్లపరంగా చూస్తే భారత్‌కు ఇది ఐదో (82.2) చెత్త ప్రదర్శన. ఆనందంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు -
ఏడేళ్ల తర్వాత టీమిండియా..
లార్డ్స్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 86 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో కోహ్లి అండ్ గ్యాంగ్ తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. టాస్ ఓడిన భారత్ మొదట బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేజ్ చేయలేక ఓటమి పాలైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తక్కువ పరుగులకే ఔటవ్వడం.. ఆ తర్వాత కోహ్లి, సురేశ్ రైనా ఇన్నింగ్స్ చక్కదిద్దేలోపే పెవిలియన్ బాట పట్టడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున 16 ఫోర్లు నమోదయ్యాయి. కాగా, రెండో వన్డేలో భారత్ ఒక్క సిక్స్ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఇలా భారత జట్టు తన ఇన్నింగ్స్‌లో కనీసం సిక్సర్లు లేకుండా ముగించడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2011లో ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడిన భారత్ అప్పుడూ ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు సిక్స్‌ను సాధించలేకపోయింది. అయితే ఆనాటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరగా, ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ నిర్ణయాత్మక మూడో మ్యాచ్ మంగళవారం జరగనుంది. -
తెరపైకి ‘దాదా’ బయోపిక్
కోల్‌కతా : ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ, క్రీడా ప్రముఖ వ్యక్తుల జీవితకథ ఆధారంగా సినిమాలను వరుసగా వచ్చేస్తున్నాయి. తమ ఆరాధ్య హీరోల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథల ఆధారంగా తెరకెక్కిన సినిమా అటు అభిమానులను, ఇటు బాక్సాఫీస్‌ను అలరించిన విషయం తెలిసిందే. త్వరలో మరో బయోపిక్కు రంగం సిద్ధమైంది. టీమిండియా మాజీ సారథి, దాదా సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది. సౌరవ్ గంగూలీ ఆటో బయోగ్రఫీ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీ ఫిలింస్‌పై ఏక్తాకపూర్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏక్తా.. దాదాని కలిసి స్టోరీ డిస్కషన్లు చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే గంగూలీ కెరీర్‌తోపాటు.. మరుపురాని ఘట్టాలు ప్రేక్షకుల ముందు కనువిందు చేసే అవకాశం ఉంది. ఇక గంగూలీ పాత్రను పోషించబోయే నటుడెవరన్న చర్చ ఫ్యాన్స్‌లో మొదలైంది. -
ఇక ఈడెన్‌లో 'గంట' మోగనుంది!
కోల్‌కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్‌ను ఆరంభిస్తారు. ఇందుకు పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది. అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మనసు పడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ.. త్వరలో నగరంలోని ఈడెన్ గార్డెన్లో లార్డ్స్ తరహా బెల్ ను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టాడు. వచ్చే సెప్టెంబర్‌లో ఈడెన్ గార్డెన్ గంటను ఏర్పాటు చేయబోతున్నట్లు శనివారం స్పష్టం చేశాడు. 'అవును.. లార్డ్స్ తరహా గంటను ఈడెన్‌లో ప్రవేశపెట్టబోతున్నాం. మ్యాచ్ జరిగే ప్రతీ రోజూ ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు గంటతో మ్యాచ్ ను ఆరంభిస్తారు. ఇప్పటికే గంటను కొనుగోలు చేశాం. సెప్టెంబర్‌లో అమర్చడానికి యత్నిస్తున్నాం' అని గంగూలీ తెలిపాడు. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గంగూలీ గంట కొట్టి మ్యాచ్‌ను ప్రారంభించాడు. -
పాక్ ఆటగాళ్లు ఎందుకు రెచ్చిపోయారు?
కరాచీ: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం తమ క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమని కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలువురు పాకిస్తాన్ ఆటగాళ్లు నిషేధం ఎదుర్కొన్న ఇదే వేదికలో విజయం సాధించడం జట్టులో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత ఆసియా ఉపఖండం వెలుపల పాక్ సాధించిన తొలి విజయం కావడం గమనార్హం. పుష్ అప్స్ సీక్రెట్ చెప్పేశాడు! 'కాబుల్ ఆర్మీ క్యాంపు సిబ్బంది పర్యవేక్షణలో పాక్ ఆటగాళ్లు శిక్షణ పొందారు. కఠోరశ్రమతో కూడిన ఫీట్స్ చేశాం. ఆర్మీతో కలిసి పుష్ అప్స్ చేసేవాళ్లం. అందుకే వారికి ఈ విజయంలో భాగం ఉందని తెలిపేందుకు, ఆర్మీ వారికి ఈ విషయం గుర్తుకుతేవడానికి ఇంగ్లండ్ పై గెలిచిన అనంతరం లార్డ్స్ లో పాక్ ఆటగాళ్లు పుష్ అప్స్ తీశారు' అని మిస్బా వివరించాడు. సెంచరీ చేసిన అనంతరం మిస్బా కూడా పుష్ అప్స్ తీశాడు. ఆర్మీ వారు తమలో స్ఫూర్తిని నింపారని, మూడు టెస్టుల్లోనూ మంచి ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిఖ్ భాగస్వామ్యంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించారని కొనియాడాడు. -
పాకిస్తాన్ ఘనవిజయం
తొలి టెస్టులో ఇంగ్లండ్ చిత్తు లార్డ్స్: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్తాన్ చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ నాలుగో రోజు 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే ఆలౌటైంది. బెయిర్ స్టో (48), బ్యాలెన్స్ (43), విన్స్ (42) ఓ మోస్తరుగా ఆడారు. 139 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోగా... బెయిర్ స్టో, వోక్స్ (23) ఏడో వికెట్‌కు 56 పరుగులు జోడించి పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా 4 వికెట్లతో మరోసారి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. రాహత్ అలీ 3, ఆమిర్ 2 వికెట్లు తీశారు. మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన యాసిర్ షా (10/141)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో రెండో టెస్టు శుక్రవారం నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది. 2010లో లార్డ్స్ టెస్టులోనే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం బయటపడిన తర్వాత ఆరేళ్లకు ఇప్పుడు ఇదే మైదానంలో పాకిస్తాన్ మళ్లీ బరిలోకి దిగడంతో తొలి టెస్టుకు ఆరంభంనుంచే ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. -
తొలి టెస్టు ఇంగ్లండ్‌దే
బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ షో లార్డ్స్: ‘డ్రా’ ఫలితం ఖాయమనుకున్న లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చివరిరోజు బంతితో అద్భుతం చేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన బెన్ స్టోక్స్ (3/38)తో పాటు బ్రాడ్ (3/50)కూడా బంతితో పవర్ చూపడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు 124 పరుగుల తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ చివరిరోజు 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. కోరె అండర్సన్ (87 బంతుల్లో 67; 13 ఫోర్లు; 1 సిక్స్), వాట్లింగ్ (143 బంతుల్లో 59; 9 ఫోర్లు) మాత్రమే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోగలిగారు. సున్నా పరుగులకే రెండు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత స్టోక్స్ వరుస బంతుల్లో విలియమ్సన్, మెకల్లమ్ వికెట్లను తీసి చావుదెబ్బ కొట్టాడు. 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కివీస్‌ను అండర్సన్, వాట్లింగ్ జోడి ఆరో వికెట్‌కు 107 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ అవుటవ్వడంతో కివీస్ ఓటమి ఖాయమైంది. అండర్సన్, అలీ, రూట్, వుడ్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 129 ఓవర్లలో 478 పరుగులకు ఆలౌటైంది. కుక్ (162; 17 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు తొమ్మిది పరుగులు మాత్రమే జత చేశాడు. బౌల్ట్‌కు ఐదు వికెట్లు, సౌతీ, హెన్రీలకు రెండేసి వికెట్లు దక్కాయి. రెండో టెస్టు ఈనెల 29న లీడ్స్‌లో మొదలవుతుంది. -
లార్డ్స్‌లో సగర్వంగా ఎగిరిన మువ్వన్నెల జెండా!
-
రెండో టెస్టులో భారత్ విజయం
లండన్: లార్డ్స్ టెస్టులో భారత్ చెలరేగిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో రెండో టెస్టును కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ బౌలర్లు జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్నిఅందించారు. గెలుపుపై తొలుత ఉత్కంఠ నెలకొన్నాబౌలర్లు విజృంభించి వరుస వికెట్లు నేలకూల్చడంతో 95 పరుగుల తేడాతో ఇండియా జయకేతనం ఎగురవేసింది. చివరి రోజు భోజన విరామ సమయం అనంతరం ఇంగ్లిష్ ఆటగాళ్లలో నిలకడలేమి లోపించి వెనువెంటనే వికెట్లుచేజార్చుకున్నారు. ఓవర్ నైట్ స్కోర్105 పరుగులకు నాలుగు వికెట్లతో ఐదో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ 223 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. దీంతో 28 ఏళ్ల తరువాత లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ ను గెలిచిన భారత జట్టుగా ధోనీ సేన చరిత్రను తిరగరాసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో రూట్(66), ఆలీ(39),కుక్(22),బ్యాలెన్స్ (27) పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో ఇఏడు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ వెన్నువిరిచి గెలుపులో కీలక పాత్ర పోషించగా, మహ్మద్ షమీ, జడేజాలకు తలో వికెట్టు దక్కింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్:342 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ :223 -
‘లార్డ్స్’ మన చేతుల్లోకి!
-
విజయ ‘గంట’ మోగించాడా!
లార్డ్స్‌లో 28 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని కపిల్‌దేవ్ కూడా ఆస్వాదించనున్నాడా! మరో సారి ఆటగాళ్లతో తన ఆనందం పంచుకోనున్నాడా! ఈ దిగ్గజం ఇప్పుడు లార్డ్స్‌లోనే ఉన్నాడు. ఈ మైదానం సాంప్రదాయం ప్రకారం రెండో టెస్టు నాలుగో రోజు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అక్కడి గంట కొట్టి ఆటను ప్రారంభించాడు. ఆదివారం భారత్ ఉన్న స్థితిలో చూస్తే లార్డ్స్‌లో రెండో విజయానికి చేరువైనట్లు కనిపిస్తోంది. గతంలో ఇక్కడ ఆడిన 16 టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకటి గెలిచి 11 ఓడిపోయింది. ఈ సందర్భంగా నాటి విశేషాలను గుర్తు చేసుకుంటే... 1986లో భారత్ ఇక్కడ గెలిచింది కపిల్‌దేవ్ కెప్టెన్సీలోనే కావడం విశేషం. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 కీలక వికెట్లు తీసిన కెప్టెన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా కూడా నిలిచాడు. భారత్ 5 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. 21 టెస్టుల్లో కపిల్‌కు కెప్టెన్‌గా అదే తొలి విజయం. వికెట్ కీపర్ కిరణ్ మోరేకు అదే మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పరాజయం తర్వాత అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ డేవిడ్ గోవర్ పదవి ఊడింది. ఇప్పుడు అలిస్టర్ కుక్ కూడా దాదాపు అదే స్థితిలో ఉన్నాడు. అన్నట్లు నాటి టెస్టులో రోజర్ బిన్నీ తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఆడి 9 పరుగులు చేస్తే... అతని కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా ఇపుడు సరిగ్గా 19 బంతుల్లో 9 పరుగులే చేశాడు! -
‘లార్డ్స్’ మన చేతుల్లోకి!
రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్ ఇంగ్లండ్ లక్ష్యం 319 పరుగులు ప్రస్తుతం 105/4 భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 342 ఆలౌట్ జడేజా, భువనేశ్వర్ అర్ధ సెంచరీలు లండన్: లార్డ్స్ టెస్టులో భారత్ చెలరేగిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మురళీ విజయ్ (247 బంతుల్లో 95; 11 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... రవీంద్ర జడేజా (57 బంతుల్లో 68; 9 ఫోర్లు), భువనేశ్వర్ కుమార్ (71 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచి భారీ ఆధిక్యాన్ని అందించారు. ఫలితంగా ఆదివారం నాలుగో రోజు ధోని సేన రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 342 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. రూట్ (14 బ్యాటింగ్), అలీ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కుక్ (22), బాలెన్స్ (27)తో పాటు మిగతా వారు విఫలమయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్ విజయానికి 214 పరుగుల దూరంలో ఉంది. మరో ఆరు వికెట్లు తీస్తే విజయం భారత్‌ను వరిస్తుంది. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా... షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. సెషన్-1 విజయ్ సెంచరీ మిస్ ఓవర్‌నైట్ స్కోరు 169/4 తో బ్యాటింగ్ కొనసాగించిన విజయ్, ధోని (19) ఆరంభంలో ఆచితూచి ఆడారు. ఇన్నింగ్స్ 76వ ఓవర్లో ప్లంకెట్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని ఆడిన ధోని రెండో స్లిప్‌లో బెల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లైనప్‌లో ముందుకొచ్చిన స్టువర్ట్ బిన్నీ (0) ఓ నిర్లక్ష్యపు షాట్‌కు అవుట్ కావడంతో భారత్ ఒక్క పరుగు వ్యవధిలో రెండు కీలక వికెట్లు (బిన్నీ, ధోని) కోల్పోయింది. తర్వాత ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్నా విజయ్, జడేజా నాణ్యమైన షాట్లతో ఆకట్టుకున్నారు. సెంచరీ దిశగా సాగుతున్న విజయ్ను 83వ ఓవర్లో అండర్సన్ ఓ అద్భుతమైన బంతితో దెబ్బతీశాడు. దీంతో ఐదు పరుగుల తేడాతో శతకం మిస్సయింది. విజయ్, జడేజా ఐడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. రెండు పరుగుల వద్ద భువనేశ్వర్ అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. ఇతని అండతో జడేజా వేగంగా పరుగులు రాబట్టడంతో భారత్ 267/7 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. ఓవర్లు: 25; పరుగులు: 98; వికెట్లు: 3 సెషన్-2 జడేజా దూకుడు లంచ్ తర్వాత వేగంగా ఆడిన జడేజా, భువీ తొలి 10 ఓవర్లలో 66 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 99 బంతుల్లో 99 పరుగులు జోడించాక జడేజా కొట్టిన పుల్ షాట్ గాల్లోకి లేచింది. కుక్... కీపర్ వెనుక పరుగెత్తుతూ చక్కగా అందుకున్నాడు. మరో ఏడు బంతుల తర్వాత షమీ (0) పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత ఇషాంత్ (0 నాటౌట్) బంతిని ఎక్కువగా డిఫెన్స్ చేశాడు. టెస్టుల్లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న భువీ మరో రెండు పరుగులు చేసి అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిదానంగా ఆడింది. అయితే ఐదు ఓవర్ల తర్వాత ఓ ఎండ్‌లో ఇషాంత్‌ను మరో ఎండ్‌లో జడేజాను తేవడం భారత్‌కు కలిసొచ్చింది. రాబ్సన్ (7)ను జడేజా ఎల్బీ చేయడంతో ఇంగ్లండ్ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్లు: 15.1; పరుగులు: 75; వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 8; పరుగులు; 18; వికెట్లు 1 (ఇంగ్లండ్) సెషన్-3 కుక్ నిలకడ టీ తర్వాత కుక్, బాలెన్స్ వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. సింగిల్స్‌కే పరిమితం కావడంతో పరుగుల రాక మందగించింది. ఈ జోడిని విడదీసేందుకు ధోని చాలా ప్రయత్నాలు చేశాడు. ఓ ఎండ్‌లో ఇషాంత్‌ను కొనసాగిస్తూ... రెండో ఎండ్‌లో బౌలర్లను తరచూ మార్చాడు. ఈ వ్యూహం 29వ ఓవర్లో ఫలితాన్నిచ్చింది. రెండో స్పెల్‌కు వచ్చిన షమీ తొలి బంతికే బాలెన్స్‌ను అవుట్ చేశాడు. కుక్, బాలెన్స్ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఇషాంత్ తన తర్వాతి రెండు ఓవర్లలో బెల్ (1), కుక్‌లను పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ 72 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. రూట్‌తో జతకలిసిన అలీ చాలా నెమ్మదిగా ఆడాడు. భారత బౌలర్లు ఒత్తిడి పెంచినా ఎక్కువగా డిఫెన్స్ చేస్తూ వికెట్‌ను కాపాడుకున్నాడు. చివర్లో ధోని... అలీ క్యాచ్‌ను జార విడవడంతో ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 33 పరుగులు జోడించి నాలుగో రోజు ఆటను ముగించారు. ఓవర్లు: 38; పరుగులు: 87; వికెట్లు: 3 జడేజా బ్యాట్ విన్యాసం అర్ధసెంచరీ పూర్తి చేసిన తర్వాత జడేజా... డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ బ్యాట్‌ను కర్రసాము మాదిరిగా తిప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ధోని దీనికి ప్రతి స్పందనగా తన చేతిని అదే మాదిరిగా తిప్పుతూ చిరు నవ్వులు చిందించాడు. 1 ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు భువనేశ్వర్ మూడు అర్ధసెంచరీలు చేశాడు. 9వ నంబర్ బ్యాట్స్‌మన్ ఒక సిరీస్‌లో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా వరుసగా రెండు టెస్టుల్లో 50కి పైగా పరుగులు చేసి, ఐదు వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 95; ధావన్ (సి) రూట్ (బి) స్టోక్స్ 31; పుజారా (సి) ప్రయర్ (బి) ప్లంకెట్ 43; కోహ్లి (బి) ప్లంకెట్ 0; రహానే (సి) ప్రయర్ (బి) బ్రాడ్ 5; ధోని (సి) బెల్ (బి) ప్లంకెట్ 19; బిన్నీ (సి) కుక్ (బి) అలీ 0; జడేజా (సి) కుక్ (బి) స్టోక్స్ 68; భువనేశ్వర్ (సి) బెల్ (బి) స్టోక్స్ 52; షమీ (సి) ప్రయర్ (బి) అలీ 0; ఇషాంత్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (103.1 ఓవర్లలో ఆలౌట్) 342 వికెట్ల పతనం: 1-40; 2-118; 3-118; 4-123; 5-202; 6-203; 7-235; 8-334; 9-338; 10-342. బౌలింగ్: అండర్సన్ 29-11-77-1; బ్రాడ్ 23-6-93-1; స్టోక్స్ 18.1-2-51-3; ప్లంకెట్ 22-6-65-3; అలీ 11-3-28-2.ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 7; కుక్ (సి) ధోని (బి) ఇషాంత్ 22; బాలెన్స్ (సి) ధోని (బి) షమీ 27: బెల్ (బి) ఇషాంత్ 1; రూట్ బ్యాటింగ్ 14; అలీ బ్యాటింగ్ 15; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (46 ఓవర్లలో 4 వికెట్లకు) 105 వికెట్ల పతనం: 1-12; 2-70; 3-71; 4-72. బౌలింగ్: భువనేశ్వర్ 8-4-10-0; షమీ 7-1-20-1; ఇషాంత్ 10-5-13-2; జడేజా 16-4-32-1; విజయ్ 4-1-11-0; ధావన్ 1-0-1-0. -
రెండో టెస్టులోఎదురీదుతున్నభారత్
లండన్: ఇంగ్లండ్ తో ఇక్కడ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ శిఖర్ ధావన్(7) పరుగులకే అవుటై భారత్ ను నిరాశపరిచాడు. అనంతరం లంచ్ తరువాత బ్యాటింగ్ దిగిన భారత్ వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రస్తుతం128 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో మురళీ విజయ్ కు జత కలిసిన పుజారా భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.కాగా, విజయ్ (24) పరుగులకు పెవిలియన్ చేరడంతో భారత్ పతనం ఆరంభమైంది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లి (25), మహేంద్ర సింగ్ ధోనీ(1),రవీంద్ర జడేజా(3), పుజారా(28) పరుగులకే పెవిలియన్ కు చేరి అభిమానుల్ని నిరాశపరిచారు. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ(6), రహేనా(25) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్ కు రెండు వికెట్లు లభించగా, బ్రాడ్, ప్లంకెట్, స్టోక్స్, ఆలీలకు తలో ఒక వికెట్టు లభించింది. -
తొలి వికెట్టు కోల్పోయిన భారత్
లండన్:ఇంగ్లండ్ తో ఇక్కడ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి వికెట్టును కోల్పోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత భారత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(7) వికెట్టును చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న మరో భారత ఓపెనర్ మురళీ విజయ్ కు చటేశ్వర పూజారా జత కలిశాడు.ఆతిథ్య ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ఐదు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలిటెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. -
దేవుడా..!
ఎందుకు రిటైరయ్యావ్... నీలో ఇంకా ఇంత ఆట దాచుకుని..! ఎందుకు అభిమానులకు ఈ క్రికెట్ విందు లేకుండా చేశావ్.. నీ అమ్ములపొదిలో అస్త్రాలను అలాగే ఉంచుకొని..! లార్డ్స్‌లో శనివారం సచిన్ టెండూల్కర్ ఆట చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమాని ఆలోచన ఇది. ఆరు నెలల పాటు ఆటకు పూర్తిగా దూరమైనా... మాస్టర్ క్లాస్ తరిగిపోలేదు. బ్యాట్ పట్టకపోయినా షాట్లలో పదును తగ్గలేదు. స్ట్రయిట్ డ్రైవ్, అప్పర్ కట్, స్క్వేర్ డ్రైవ్, కవర్‌డ్రైవ్... ఇలా తన మార్క్ షాట్లతో అభిమానులను ఓలలాడించాడు. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లకంటే అద్భుతంగా ఆడి ఔరా! అనిపించాడు. ఏడు అణిముత్యాల్లాంటి బౌండరీలతో... ‘క్లాస్’ శాశ్వతం అని మరోసారి నిరూపించాడు. క్రికెట్ దేవుడి బ్యాట్ నుంచి ఆ ఆటను మళ్లీ చూసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్యూ... లార్డ్స్..!