లండన్: ఐర్లాండ్ జట్టు పోరాటంతో ఇంగ్లండ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి రాగా... తుది ఫలితం మాత్రం ఊహించిన విధంగానే వచి్చంది. లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో శనివారం ముగిసిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 97/3తో ఆట కొనసాగించిన ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 363 పరుగులకు ఆలౌటైంది.
మార్క్ ఎడైర్ (88) ఆండీ మెక్‌బ్రైన్ (86 నాటౌట్) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో తొలి టెస్టు ఆడిన జోష్ టంగ్ (5/66) ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 11 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ తొలి 4 బంతుల్లోనే 3 ఫోర్లతో అందుకుంది.
చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment