లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ను 172 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. అదే రోజు బ్యాటింగ్ కు వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాక్ క్రాలే (45 బంతుల్లో 56, 11 ఫోర్లు) , బెన్ డకెట్ (178 బంతుల్లో 182, 24 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడారు.
ఈ ఇద్దరితో పాటు ఓలీ పోప్(205) డబుల్ సెంచరీతో చెలరేగాడు. వీరిముగ్గరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 524 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగలకు ఆలౌటైంది. కేవలం 10 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ ముంగిట ఐరీష్ జట్టు ఉంచింది. 10 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నాలుగు బంతుల్లోనే ఛేదించింది.
బెన్ స్టోక్స్ అరుదైన ఘనత..
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేయలేదు. ఇలా జరగడం టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి సారి.
చదవండి: WTC Final 2023: ‘ఓవల్’ను ఓ లుక్కేద్దామా!
Comments
Please login to add a commentAdd a comment