లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టుబిగించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విధ్వంసం సృష్టించగా.. జాక్ క్రాలే (56), జో రూట్ అర్ధసెంచరీలతో రాణించారు. అంతకుముందు వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది.
టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..?
ఇటీవల కాలంలో టెస్ట్‌ల్లో బజ్‌బాల్ అప్రోచ్ అంటూ ఆటలో వేగం పెంచిన ఇంగ్లీష్ క్రికెటర్లు, ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్‌లోనూ అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. వీరు ఎంత వేగంగా ఆడారంటే.. ఈ మ్యాచ్‌ను చూసిన ఫాలోవర్స్‌కు ఇది టెస్ట్ మ్యాచా లేక వన్డేనా అన్న డౌట్ వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా 6కు పైగా రన్ రేట్ మెయింటైన్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించడంతో పాటు వేగంగా పరుగులు రాబట్టారు. వీరి వేగం చూస్తుంటే రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తుంది. రెండో రోజు మరో 25 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐర్లాండ్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు.
టెస్ట్‌ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీ..
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఓలీ పోప్ టెస్ట్‌ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీని, ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన ద్విశతకాన్ని బాదాడు. సిక్సర్‌తో డబుల్ హండ్రెడ్‌ను పూర్తి చేసిన పోప్.. 207 బంతుల్లో ఈ మార్కును అందున్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ డబుల్ హండ్రెడ్ రికార్డు జట్టు సారధి బెన్ స్టోక్స్ (163 బంతుల్లో) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టల్ (153) పేరిట ఉంది. ఆస్టల్ తర్వాత స్టోక్స్, సెహ్వాగ్ (168), సెహ్వాగ్ (182), మెక్‌కల్లమ్ (186) ఈ రికార్డును సాధించారు.
చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్
Comments
Please login to add a commentAdd a comment