సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భాగం కానున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరపున స్టోక్స్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో రూ. 8.5 కోట్ల భారీ ధరకు స్టోక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. స్టోక్సీ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు.
అయితే గత కొన్ని రోజులగా స్టోక్స్ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టిసారించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్టోక్స్.. ఈ ఏడాది మినీ వేలానికి ముందు తన నిర్ణయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీకి తెలియజేశాడు.
దీంతో అతడిని సీఎస్‌కే రిటైన్ చేసుకోలేదు. ఒకవేళ ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీతో స్టోక్స్ చేరితో ఆ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. ఇప్పటికే ఆ జట్టులో కిరాన్ పొలార్డ్, రషీద్‌ఖాన్, రబాడ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయినప్పటకి గత రెండు సీజన్లలో కేప్‌టౌన్ జట్టు చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
స్టోక్సీ రాకతోనైనా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. అదేవిధంగా ఈ ఏడాది ది హాండ్రడ్ లీగ్‌లో కూడా స్టోక్స్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ జో రూట్‌తో సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ పార్ల్ రాయల్స్ ఒప్పందం కుదర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment