రెండో టెస్టులోఎదురీదుతున్నభారత్ | team India stumble after lunch | Sakshi
Sakshi News home page

రెండో టెస్టులోఎదురీదుతున్నభారత్

Published Thu, Jul 17 2014 8:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

ఇంగ్లండ్ తో ఇక్కడ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఎదురీదుతోంది

లండన్: ఇంగ్లండ్ తో ఇక్కడ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ శిఖర్ ధావన్(7) పరుగులకే అవుటై భారత్ ను నిరాశపరిచాడు. అనంతరం లంచ్ తరువాత బ్యాటింగ్ దిగిన భారత్ వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ప్రస్తుతం128 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో మురళీ విజయ్ కు జత కలిసిన పుజారా భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.కాగా, విజయ్ (24) పరుగులకు పెవిలియన్ చేరడంతో భారత్ పతనం ఆరంభమైంది.

 

భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లి (25), మహేంద్ర సింగ్ ధోనీ(1),రవీంద్ర జడేజా(3), పుజారా(28) పరుగులకే పెవిలియన్ కు చేరి అభిమానుల్ని నిరాశపరిచారు. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ(6), రహేనా(25) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్ సన్ కు రెండు వికెట్లు లభించగా, బ్రాడ్, ప్లంకెట్, స్టోక్స్, ఆలీలకు తలో ఒక వికెట్టు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement