వరుస బంతుల్లో రెండు వికెట్లు.. ఇంగ్లండ్ 41/2
►టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తడబడుతుంది. సిరాజ్ వరుస బంతుల్లో సిబ్లీ, హసీబ్ హమీద్‌లను పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు బ్రేక్ అందించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ 18, జో రూట్ 10 పరుగుతో క్రీజులో ఉన్నారు.
అండర్సన్ పాంచ్ పటాకా.. టీమిండియా ఆలౌట్
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. 40 పరుగులు చేసిన జడేజా మార్క్‌వుడ్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 129 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ 83, కోహ్లి 42, జడేజా 40 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో దుమ్మురేపగా.. మార్క్ వుడ్, రాబిన్సన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.
ఇషాంత్ శర్మ ఔట్.. ఎనిమిదో వికెట్ డౌన్
►లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఇషాంత్ శర్మ రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఇషాంత్ అండర్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా జడేజా 39 పరుగులతో తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.
లంచ్ విరామం.. టీమిండియా స్కోరు 346/7
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు ఆటలో లంచ్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 31, ఇషాంత్ శర్మ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 278/3 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే కేఎల్ రాహుల్, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు ఇన్నింగ్స్‌కు కొనసాగించారు. అయితే 37 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. షమీ కూడా వెంటనే వెనుదిరగడంతో ఏడు వికెట్లు కోల్పోయి లంచ్ విరామానికి వెళ్లింది.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వెనువెంటనే ఏడు వికెట్ కోల్పోయింది. పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షమీ పరుగులేమి చేయకుండానే మొయిన్ అలీ బౌలింగ్‌లో రోరీ బర్న్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. జడేజా 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
రిషబ్ పంత్ ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పంత్ మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రహానే ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికి భారీస్కోరుగా మలచలేకపోయాడు. ఆఫ్‌స్టంప్ అవతల వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
వెనువెంటనే రెండు వికెట్లు.. టీమిండియా 283/5
టీమిండియాతో రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ కేఎల్ రాహుల్, అజింక్యా రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయింది. మొదట 129 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఓలి రాబిన్‌సన్ వేసిన ఇన్నింగ్స్ 91 ఓవర్ రెండో బంతికి సిబ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జేమ్స్ అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 92వ ఓవర్ తొలి బంతికే 1 పరుగు చేసిన రహానే రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 4, జడేజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటిరోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో దుమ్మురేపడం.. మరో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులతో రాణించడంతో భారత్ తొలిరోజే భారీ స్కోరు సాధించింది. పుజారా 9 పరుగులకే వెనుదిరిగినప్పటికి.. విరాట్ కోహ్లి 42 పరుగులతో మంచి టచ్‌లో కనిపించినా దానిని భారీస్కోరుగా మలచలేకపోయాడు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. సెంచరీతో జోరుమీదున్న రాహుల్‌కు రహానే మద్దతు ఇస్తే టీమిండియాకు లార్డ్స్ టెస్టుపై పట్టు చిక్కినట్లే.
Comments
Please login to add a commentAdd a comment