లార్డ్స్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తొలిసారి నిర్వహించిన హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2021 టైటిల్‌ను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకుంది. బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌తో జరిగిన ఫైనల్లో 32 పరుగుల తేడాతో విజయం సాధించిన సదరన్ బ్రేవ్ తొలి చాంపియన్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్.. ఐర్లాండ్ ఆటగాడు.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్( 36 బంతుల్లో 61;6 సిక్సర్లు, 2 ఫోర్లు) సిక్సర్ల వర్షానికి తోడూ.. చివర్లో రాస్ విట్‌లీ(19 బంతుల్లో 44 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
చదవండి: మహిళల ‘హండ్రెడ్’ విజేత ఓవల్ ఇన్‌విన్సిబుల్స్
అనంతరం బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్ హీరో లియామ్ లివింగ్‌స్టన్(19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి మెరుపులు మెరిపించినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. చివర్లో బెంజమిన్ 23, బెన్నీ హౌవెల్ 20 నాటౌట్‌గా నిలిచారు. ఇక సదరన్ బ్రేవ్ బౌలింగ్‌లో జార్జ్ గార్టన్, క్రెగ్ ఓవర్‌టన్, టైమెల్ మిల్స్, జేక్ లిన్‌టోట్ తలా ఒక వికెట్ తీశారు. అద్భుత ఇన్నింగ్స్‌తో సదరన్ బ్రేవ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్టిర్లింగ్‌కు ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'' వరించగా.. టోర్నీ ఆద్యంతం నిలకడగా రాణించిన లియాయ్ లివింగ్‌స్టన్ ''ప్లేయర్ ఆఫ్ ది సిరీస్''గా నిలిచాడు.
చదవండి: Manan Sharma: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్
Comments
Please login to add a commentAdd a comment