Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పయనం పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఐదు విజయాలు, ఆరు ఓటములతో పది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది.
ఇక పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్‌స్టోన్ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్‌లాడిన లివింగ్‌స్టోన్ 172 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 437 పరుగులతో రాణించాడు. గతేడాది ఫామ్‌ను ఈసారి కంటిన్యూ చేయడంలో విఫలమయ్యాడు. తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లివింగ్‌స్టోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బ్యాటింగ్ చేసేటప్పుడు మద్దతు అందించే పాత్ర కన్నా బాదడమే ఎక్కువగా ఇష్టమని పేర్కొన్నాడు. లివింగ్‌స్టోన్ మాట్లాడుతూ.. ''ఒక బ్యాటర్ ఎలా ఆడాలనేది జట్టును బట్టి ఉంటుంది. మద్దతు అందించే పాత్రను పోషించడం నాకిష్టం ఉండదు. ప్రతి జట్టులో భిన్నమైన ఆటగాళ్లు.. వాళ్లకు భిన్నమైన పాత్రలు ఉంటాయి. నావరకైతే క్రికెట్‌ను ఆస్వాదిస్తా. భారీ షాట్లను కొట్టడాన్ని ఇష్టపడతా. పంజాబ్ తరపున విజయాల్లో నావంతు పాత్రను సమర్థంగా పోషించడంపైనే దృష్టి సారించా ''అని లివింగ్‌స్టోన్ తెలిపాడు.
చదవండి: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..!
Comments
Please login to add a commentAdd a comment